Imdarerimgina pani yela baasalu sesevu

ఇందరెరిఁగిన పని యేల బాసలు సేసేవు
Language

(॥పల్లవి॥)
ఇందరెరిఁగిన పని యేల బాసలు సేసేవు
ముందుముందే ఆపెకు మొక్కవయ్య నీవు

(॥ఇంద॥)
నగుతా నీవేకాదా నాతో మాటలాడఁగ
అగపడల్లంతనుండి ఆపెఁ జూచెను
యెగసక్కేలు సేయక యేల మానీ నిఁక నేఁడు
మొగమోడేయట్టుగాను మొక్కవయ్యా నీవు

(॥ఇంద॥)
సమ్మతించి నీవు నేను చదురంగమాడఁగాను
యెమ్మెల కెరుకసేసి యెత్తు చెప్పెను
కమ్మి నిన్నుఁ దిట్టుటకు కారణమిదేకాదా
ముమ్మాటికి సెలవు మొక్కవయ్య నీవు

(॥ఇంద॥)
యెలమి నీవును నేను ఇంటిలోఁ గూచుండఁగాను
తలుపు దెరచి యాపె తానే వచ్చెను
చెలఁగి పొందవలదా శ్రీవేంకటేశ్వర నిన్ను
ములువాఁడిగోరు సోఁక మొక్కవయ్య నీవు

(||pallavi||)
iṁdarĕrim̐gina pani yela bāsalu sesevu
muṁdumuṁde ābĕgu mŏkkavayya nīvu

(||iṁda||)
nagudā nīvegādā nādo māḍalāḍam̐ga
agabaḍallaṁtanuṁḍi ābĕm̐ jūsĕnu
yĕgasakkelu seyaga yela mānī nim̐ka nem̐ḍu
mŏgamoḍeyaṭṭugānu mŏkkavayyā nīvu

(||iṁda||)
sammadiṁchi nīvu nenu saduraṁgamāḍam̐gānu
yĕmmĕla kĕrugasesi yĕttu sĕppĕnu
kammi ninnum̐ diṭṭuḍagu kāraṇamidegādā
mummāḍigi sĕlavu mŏkkavayya nīvu

(||iṁda||)
yĕlami nīvunu nenu iṁṭilom̐ gūsuṁḍam̐gānu
talubu dĕrasi yābĕ tāne vachchĕnu
sĕlam̐gi pŏṁdavaladā śhrīveṁkaḍeśhvara ninnu
muluvām̐ḍigoru som̐ka mŏkkavayya nīvu