ఇందరయ్యా విడేలు మీ కిద్దరికిని
(॥పల్లవి॥)
ఇందరయ్యా విడేలు మీ కిద్దరికిని
పొందులు మఱవవద్దు పొసఁగిన చోటను
(॥ఇంద॥)
ముచ్చటలాడఁగవలె మొగము చూడఁగవలె
మచ్చరమేటికి నాలిమగనికి
కొచ్చి కొచ్చి నవ్వవలె కూడి మాడి వుండవలె
వొచ్చెము లెంచఁగవొద్దు వొనరినచోటను
(॥ఇంద॥)
కాఁపురాలు సేయవలె కాయములు సోఁకవలె
తోపునూపు డేమిటికి దొరలకును
యేపొద్దుఁ బెలఁగవలె ఇంటిలో మెలఁగవలె
కోపాలొద్దు చుట్టాలై గురియైనచోటను
(॥ఇంద॥)
రమ్మని పిలువవలె రతుల మెప్పించవలె
దొమ్మి జగడమేలేల దొడ్డవారికి
ఇమ్ముల శ్రీవేంకటేశ యీకె నీవూఁగూడితిరి
కమ్మలఁ జెప్పఁగ వుద్దు కలసి చోటను
(||pallavi||)
iṁdarayyā viḍelu mī kiddarigini
pŏṁdulu maṟavavaddu pŏsam̐gina soḍanu
(||iṁda||)
muchchaḍalāḍam̐gavalĕ mŏgamu sūḍam̐gavalĕ
machcharameḍigi nālimaganigi
kŏchchi kŏchchi navvavalĕ kūḍi māḍi vuṁḍavalĕ
vŏchchĕmu lĕṁcham̐gavŏddu vŏnarinasoḍanu
(||iṁda||)
kām̐purālu seyavalĕ kāyamulu som̐kavalĕ
tobunūbu ḍemiḍigi dŏralagunu
yebŏddum̐ bĕlam̐gavalĕ iṁṭilo mĕlam̐gavalĕ
kobālŏddu suṭṭālai guriyainasoḍanu
(||iṁda||)
rammani piluvavalĕ radula mĕppiṁchavalĕ
dŏmmi jagaḍamelela dŏḍḍavārigi
immula śhrīveṁkaḍeśha yīgĕ nīvūm̐gūḍidiri
kammalam̐ jĕppam̐ga vuddu kalasi soḍanu