Imdaramum joodamgaam daanevvado kaani

ఇందరముఁ జూడఁగాఁ దానెవ్వతో కాని
Language

(॥పల్లవి॥)
ఇందరముఁ జూడఁగాఁ దానెవ్వతో కాని
ముందే నన్ను నేలితివి మొక్కీఁ దాను నీకు

(॥ఇంద॥)
తెల్లమిగా నీతోను తేనేగారే మోవితోడ
చెల్లుబడిమాఁట లాడీఁ జెలియ
గొల్లెతఁగాబోలు నీపె గొప్పగొప్ప చన్నులతో
కెల్లురేఁగి పైకొనీని కిందుమీఁదెఱఁగదు

(॥ఇంద॥)
పెంచెపుఁ బయ్యెదతోడఁ బెడమరలి నీదిక్కు
పొంచుక సారెకుఁ జూచీఁ బొలఁతి
చెంచెతగాఁబోలు నీకె చెక్కుల జవ్వాది నీపై
యించుకించుకే చమరీ నెడ్డతనమునను

(॥ఇంద॥)
సరసపుఁ జేఁతలను సగినాలు చెప్పకొంటా
నిరతిఁ జేతులు చాఁచీ నీపై వనిత
యెరికెత గాఁబోలు నిన్నీకె శ్రీవేంకటేశుఁడ
మరిగించుకొనె నిట్టె మంచితనములను

(||pallavi||)
iṁdaramum̐ jūḍam̐gām̐ dānĕvvado kāni
muṁde nannu nelidivi mŏkkīm̐ dānu nīgu

(||iṁda||)
tĕllamigā nīdonu tenegāre movidoḍa
sĕllubaḍimām̐ṭa lāḍīm̐ jĕliya
gŏllĕdam̐gābolu nībĕ gŏppagŏppa sannulado
kĕllurem̐gi paigŏnīni kiṁdumīm̐dĕṟam̐gadu

(||iṁda||)
pĕṁchĕbum̐ bayyĕdadoḍam̐ bĕḍamarali nīdikku
pŏṁchuga sārĕgum̐ jūsīm̐ bŏlam̐ti
sĕṁchĕdagām̐bolu nīgĕ sĕkkula javvādi nībai
yiṁchugiṁchuge samarī nĕḍḍadanamunanu

(||iṁda||)
sarasabum̐ jem̐talanu saginālu sĕppagŏṁṭā
niradim̐ jedulu sām̐sī nībai vanida
yĕrigĕda gām̐bolu ninnīgĕ śhrīveṁkaḍeśhum̐ḍa
marigiṁchugŏnĕ niṭṭĕ maṁchidanamulanu