ఇందరముఁ బైకొంటే నేమిసేసేవు
(॥పల్లవి॥)
ఇందరముఁ బైకొంటే నేమిసేసేవు
చెంది నీకిప్పుడే చాటిచెప్పితిఁ జుమీ
(॥ఇంద॥)
చీరలియ్యఁగదవోయి సిగ్గరిగొల్లెతలము
చేరి మమ్మునేల కాకుసేసేవోయి
బారెఁడేసినెరులివె పైఁ గప్పుకున్నారము
కేరికేరి యంత కిలకిల నవ్వేవోయి
(॥ఇంద॥)
చేతులెత్తి మొక్కుమని చెప్పేవు పలుమారు
కాతరీఁడ వౌదువు దగ్గర రావోయి
జౌతిగాఁ దమ్మిపువ్వులఁ జాటువెట్టుకున్నారము
యేతరిచేఁతలు మాతోనేల సేసేవోయి
(॥ఇంద॥)
వలపులు చల్లేవు వడి మాపై సేసలుగా
కలసి చీర లిచ్చితి గామిడివోయి
అలమేలుమంగపతివైన శ్రీవేంకటేశ్వర
ఫలించే మానోము నీవే పతివయితివోయి
(||pallavi||)
iṁdaramum̐ baigŏṁṭe nemisesevu
sĕṁdi nīgippuḍe sāḍisĕppidim̐ jumī
(||iṁda||)
sīraliyyam̐gadavoyi siggarigŏllĕdalamu
seri mammunela kāgusesevoyi
bārĕm̐ḍesinĕrulivĕ paim̐ gappugunnāramu
kerigeri yaṁta kilagila navvevoyi
(||iṁda||)
sedulĕtti mŏkkumani sĕppevu palumāru
kādarīm̐ḍa vauduvu daggara rāvoyi
jaudigām̐ dammibuvvulam̐ jāḍuvĕṭṭugunnāramu
yedarisem̐talu mādonela sesevoyi
(||iṁda||)
valabulu sallevu vaḍi mābai sesalugā
kalasi sīra lichchidi gāmiḍivoyi
alamelumaṁgabadivaina śhrīveṁkaḍeśhvara
phaliṁche mānomu nīve padivayidivoyi