ఇందాఁకానున్న భావ మేమి చెప్పేది
(॥పల్లవి॥)
ఇందాఁకానున్న భావ మేమి చెప్పేది
చెంది వేడుకతో మించె చెక్కునొక్కఁగాను
(॥ఇందాఁ॥)
చిగిరించెఁ జిత్తము చిరునవ్వులు మొనసె
మొగము కళలునిండె ముదితకును
వెలగులన్నియుఁ బాసె వేడుకలుదైవారె
మగటిమితో నీవు మాటలాడఁగాను
(॥ఇందాఁ॥)
పొదలెను కుచములు భోగపుటాసలు రేఁగె
యెదిరించెఁ బులకలు యింతికిని
అదన నానంద మొబ్బె ఆయములు గరఁగెను
చదురుఁదనాన నీవు చనవియ్యఁగాను
(॥ఇందాఁ॥)
కొప్పు గడు వెడజారె గుట్టుఁ దమకము నిండె
అప్పటి వలపు పండె నతివకును
కుప్పళించెఁ దమకము కోరికలు దైవారె
నెప్పున శ్రీవేంకటేశ నీవు గూడఁగాను
(||pallavi||)
iṁdām̐kānunna bhāva memi sĕppedi
sĕṁdi veḍugado miṁchĕ sĕkkunŏkkam̐gānu
(||iṁdām̐||)
sigiriṁchĕm̐ jittamu sirunavvulu mŏnasĕ
mŏgamu kaḽaluniṁḍĕ mudidagunu
vĕlagulanniyum̐ bāsĕ veḍugaludaivārĕ
magaḍimido nīvu māḍalāḍam̐gānu
(||iṁdām̐||)
pŏdalĕnu kusamulu bhogabuḍāsalu rem̐gĕ
yĕdiriṁchĕm̐ bulagalu yiṁtigini
adana nānaṁda mŏbbĕ āyamulu garam̐gĕnu
sadurum̐danāna nīvu sanaviyyam̐gānu
(||iṁdām̐||)
kŏppu gaḍu vĕḍajārĕ guṭṭum̐ damagamu niṁḍĕ
appaḍi valabu paṁḍĕ nadivagunu
kuppaḽiṁchĕm̐ damagamu korigalu daivārĕ
nĕppuna śhrīveṁkaḍeśha nīvu gūḍam̐gānu