Imdaamkaa vemgirimta kichcha numtini

ఇందాఁకా వేఁగిరింత కిచ్చ నుంటిని
Language

(॥పల్లవి॥)
ఇందాఁకా వేఁగిరింత కిచ్చ నుంటిని
చెందితివిగా ఇట్టె చిత్తగించు నన్నును

(॥ఇందాఁ॥)
చెనకినవాఁడవు చేపట్టక మానేవా
చనువులు గలుగు దాఁకా చక్కనుంటిని
నిను నెంచి చూచితేను నేరుపరి విన్నిటాను
యెనసి వొరసితివి యిఁకఁ జూడు నన్నును

(॥ఇందాఁ॥)
నవ్వినట్టి వాఁడవు నమ్మించక మానేవా
రవ్వలైన యందాఁకా రాక వుంటిని
యివ్వల నీ మహిమలు యిందరుఁ దెలిసినవే
జవ్వనమే తరవాయ చక్కఁజూడు నన్నును

(॥ఇందాఁ॥)
కూడినట్టి వాఁడవు గురుతు గాక మానేవా
యీడు చూచుకొన్నదాఁకా యింట నుంటిని
యీడనె శ్రీ వేంకటేశ యేలితివి నన్ను నిట్టె
పాడి పంతముల చేర భావించు నన్నును

(||pallavi||)
iṁdām̐kā vem̐giriṁta kichcha nuṁṭini
sĕṁdidivigā iṭṭĕ sittagiṁchu nannunu

(||iṁdām̐||)
sĕnaginavām̐ḍavu sebaṭṭaga mānevā
sanuvulu galugu dām̐kā sakkanuṁṭini
ninu nĕṁchi sūsidenu nerubari vinniḍānu
yĕnasi vŏrasidivi yim̐kam̐ jūḍu nannunu

(||iṁdām̐||)
navvinaṭṭi vām̐ḍavu nammiṁchaga mānevā
ravvalaina yaṁdām̐kā rāga vuṁṭini
yivvala nī mahimalu yiṁdarum̐ dĕlisinave
javvaname taravāya sakkam̐jūḍu nannunu

(||iṁdām̐||)
kūḍinaṭṭi vām̐ḍavu gurudu gāga mānevā
yīḍu sūsugŏnnadām̐kā yiṁṭa nuṁṭini
yīḍanĕ śhrī veṁkaḍeśha yelidivi nannu niṭṭĕ
pāḍi paṁtamula sera bhāviṁchu nannunu