ఇందాఁకా రతికేలికి నెదురులు చూచితివి
(॥పల్లవి॥)
ఇందాఁకా రతికేలికి నెదురులు చూచితివి
పొందు లొనగూడెఁ గదె పూఁచినట్టు నీకు
(॥ఇంద్రా॥)
మంతనాన నాతనితో మాఁటలెల్లా నాడితివి
సంతోసమాయఁగదవే సకియ నీకు
చెంతనుండి చేతులారా సేవలెల్లాఁ జేసితివి
పంతములు చెల్లెఁగదె పడఁతులలోనను
(॥ఇంద్రా॥)
తిలకిం చాతనితోడఁ దేరకొన నవ్వితివి
తలఁపు లీడేరెఁగదె తరుణి నీకు
వలపించి యిట్టె కైవసము సేసుకొంటివి
వోలసెఁగదవే నీవేడుక లన్నియును
(॥ఇంద్రా॥)
రాఁపుగ శ్రీవేంకటేశరతులెల్లాఁ జేకొంటివి
కాఁపురము దక్కెఁగదె కలికి నీవు
యేపున నోలలాడితి వెనసి కాఁగిటిలోన
నీ పగటు మించెఁగదె నేఁ డితని యెదుట
(||pallavi||)
iṁdām̐kā radigeligi nĕdurulu sūsidivi
pŏṁdu lŏnagūḍĕm̐ gadĕ pūm̐sinaṭṭu nīgu
(||iṁdrā||)
maṁtanāna nādanido mām̐ṭalĕllā nāḍidivi
saṁtosamāyam̐gadave sagiya nīgu
sĕṁtanuṁḍi sedulārā sevalĕllām̐ jesidivi
paṁtamulu sĕllĕm̐gadĕ paḍam̐tulalonanu
(||iṁdrā||)
tilagiṁ sādanidoḍam̐ deragŏna navvidivi
talam̐pu līḍerĕm̐gadĕ taruṇi nīgu
valabiṁchi yiṭṭĕ kaivasamu sesugŏṁṭivi
volasĕm̐gadave nīveḍuga lanniyunu
(||iṁdrā||)
rām̐puga śhrīveṁkaḍeśharadulĕllām̐ jegŏṁṭivi
kām̐puramu dakkĕm̐gadĕ kaligi nīvu
yebuna nolalāḍidi vĕnasi kām̐giḍilona
nī pagaḍu miṁchĕm̐gadĕ nem̐ ḍidani yĕduḍa