ఇందాఁకా రావైతివంటా యేల గరిసించేవే
(॥పల్లవి॥)
ఇందాఁకా రావైతివంటా యేల గరిసించేవే
మందెమేలమేల మంచిమాట లాడవే
(॥ఇందాఁ॥)
వంకలాడవలెఁగాక వలచిన పతితోడ
అంకకత్తెవలెనేల అఱ్ఱదిమేవే
మంకులాడఁదగునా మగవానితోడ నీకు
కంకణాల చేత నిట్టె కాఁగిలించవే
(॥ఇందాఁ॥)
చేరి నవ్వవలెఁగాక సిగ్గువడ్డ పతితోడ
తేరకత్తెవలెనేల తేలనాడేవే
బీరము చూపఁదగునా ప్రియునిముందట నీకు
గోరికొన కొంత సోఁక కొంగువట్టి తియ్యవే
(॥ఇందాఁ॥)
చెక్కు నొక్కవలెఁగాక శ్రీ వేంకటపతితోడ
పుక్కటికత్తెవై యేల పొంచుకుండేవే
వొక్కటై యాతఁడు నిన్ను వురమునఁబెట్టుకొనె
దక్కఁగొని మదనముద్రలు నించవే
(||pallavi||)
iṁdām̐kā rāvaidivaṁṭā yela garisiṁcheve
maṁdĕmelamela maṁchimāḍa lāḍave
(||iṁdām̐||)
vaṁkalāḍavalĕm̐gāga valasina padidoḍa
aṁkagattĕvalĕnela aṭradimeve
maṁkulāḍam̐dagunā magavānidoḍa nīgu
kaṁkaṇāla seda niṭṭĕ kām̐giliṁchave
(||iṁdām̐||)
seri navvavalĕm̐gāga sigguvaḍḍa padidoḍa
teragattĕvalĕnela telanāḍeve
bīramu sūbam̐dagunā priyunimuṁdaḍa nīgu
gorigŏna kŏṁta som̐ka kŏṁguvaṭṭi tiyyave
(||iṁdām̐||)
sĕkku nŏkkavalĕm̐gāga śhrī veṁkaḍabadidoḍa
pukkaḍigattĕvai yela pŏṁchuguṁḍeve
vŏkkaḍai yādam̐ḍu ninnu vuramunam̐bĕṭṭugŏnĕ
dakkam̐gŏni madanamudralu niṁchave