Imdaamkaa raadamtaa nemkaridi veedanigi

ఇందాఁకా రాడంటా నేఁకరితి వీతనికి
Language

(॥పల్లవి॥)
ఇందాఁకా రాడంటా నేఁకరితి వీతనికి
విందులుగా మోవి ఇచ్చి విడెమియ్యరాదా

(॥ఇందా॥)
చెక్కు చేతఁబెట్టుకొని సిగ్గులువడఁగనేల
చక్కనియాతని మోము సారెఁ జూడవే
ముక్కుమీఁద వేలిడుక ముసిముసినవ్వులేల
మొక్కరాదా చేతులెత్తి ముందర నిలుచుండి

(॥ఇందా॥)
చెలుల కాతనిఁ జూపి చేసన్న లేమి సేసేవు
పలుకుల వినయాలు పచరించేవే
వలిపెపయ్యదలోన వలిగుబ్బ లేల దాఁచ
సులభాన నాతనికి సూడిదె చూపరాదా

(॥ఇందా॥)
పానుపుపైఁ గూచుండి పాదా లెందాఁకా నొత్తేవు
మేనుమేను సోఁకఁగూడి మెప్పించవే
అనుక శ్రీవేంకటేశుఁ డన్నిటా నిన్ను మన్నించె
సేనా సేనసేవలెల్లాఁ జేయరాదా ఇంకాను

(||pallavi||)
iṁdām̐kā rāḍaṁṭā nem̐karidi vīdanigi
viṁdulugā movi ichchi viḍĕmiyyarādā

(||iṁdā||)
sĕkku sedam̐bĕṭṭugŏni sigguluvaḍam̐ganela
sakkaniyādani momu sārĕm̐ jūḍave
mukkumīm̐da veliḍuga musimusinavvulela
mŏkkarādā sedulĕtti muṁdara nilusuṁḍi

(||iṁdā||)
sĕlula kādanim̐ jūbi sesanna lemi sesevu
palugula vinayālu pasariṁcheve
valibĕbayyadalona valigubba lela dām̐sa
sulabhāna nādanigi sūḍidĕ sūbarādā

(||iṁdā||)
pānububaim̐ gūsuṁḍi pādā lĕṁdām̐kā nŏttevu
menumenu som̐kam̐gūḍi mĕppiṁchave
anuga śhrīveṁkaḍeśhum̐ ḍanniḍā ninnu manniṁchĕ
senā senasevalĕllām̐ jeyarādā iṁkānu