ఇందాఁకా నోరిచితి ఇంత చాలదా
(॥పల్లవి॥)
ఇందాఁకా నోరిచితి ఇంత చాలదా
కందువలెల్లాఁ దారుకాణించవలెనా
(॥ఇందాఁ॥)
కక్కస మేమిటికే కడు నవ్వనోనంటే
వొక్కరీతి చాయసేసు కుండఁగవద్దా
తక్కరీఁడు తనచేఁత తనమనసే యురుఁగు
వెక్కసమై నేనే యింత విచ్చి చెప్పవలెనా
(॥ఇందాఁ॥)
వేగిర మేమిటికే వెనకఁ బలిచేనంటే
చేగదేరకుండా గుట్టుసేయఁగవద్దా
ఆగడీఁడు తనసుద్దులవి దలఁచుకొమ్మను
తీగెసాగ నందరిలో తెలుపఁగ వలెనా
(॥ఇందాఁ॥)
చలము లేమిటికే విచారించుకొనేనంటే
కొలఁదితో నందు కియ్యకొనవద్దా
అలరి శ్రీవేంకటేశుఁ డంతలోఁ దా నన్నుఁ గూడె
మెలఁగి యింతలోఁ దన్ను మెచ్చు మెచ్చవలెనా
(||pallavi||)
iṁdām̐kā norisidi iṁta sāladā
kaṁduvalĕllām̐ dārugāṇiṁchavalĕnā
(||iṁdām̐||)
kakkasa memiḍige kaḍu navvanonaṁṭe
vŏkkarīdi sāyasesu kuṁḍam̐gavaddā
takkarīm̐ḍu tanasem̐ta tanamanase yurum̐gu
vĕkkasamai nene yiṁta vichchi sĕppavalĕnā
(||iṁdām̐||)
vegira memiḍige vĕnagam̐ balisenaṁṭe
segaderaguṁḍā guṭṭuseyam̐gavaddā
āgaḍīm̐ḍu tanasuddulavi dalam̐sugŏmmanu
tīgĕsāga naṁdarilo tĕlubam̐ga valĕnā
(||iṁdām̐||)
salamu lemiḍige visāriṁchugŏnenaṁṭe
kŏlam̐dido naṁdu kiyyagŏnavaddā
alari śhrīveṁkaḍeśhum̐ ḍaṁtalom̐ dā nannum̐ gūḍĕ
mĕlam̐gi yiṁtalom̐ dannu mĕchchu mĕchchavalĕnā