ఇందాఁకా నిన్ను దూరితి నెఱఁగక రమణుఁడ
(॥పల్లవి॥)
ఇందాఁకా నిన్ను దూరితి నెఱఁగక రమణుఁడ
గొందిఁ బాసికూడిన కూటమే కా చవులు
(॥ఇందాఁ॥)
విరహతాపము మాన్ప విచ్చేసితి వీడ విట్టె
వొరసితే నా కిదెంతవుపకారము
సరి నీవు నవ్వితేను చల్లనారె నా కోపము
మరుగఁ జేసిన యీ మన్ననెంత నాకు
(॥ఇందాఁ॥)
అలపెల్లాఁ దీర నీచేయి అట్టె నాపై వేసితివి
వొలిసిన నా కిదెంతవుపకారము
పలికి మోము చూచితే పల్లవించె నా మనసు
కలకాలముఁ జేసిన కరుణెంత నాకు
(॥ఇందాఁ॥)
విడువక యిపుడు శ్రీ వేంకటేశ కూడితివి
వొడలికి నా కిదెంతవుపకారము
అడియాల మిచ్చితివి అందరిలో యెంత కీర్తి
వుడివోని వలపుల కుంకువాయ నాకు
(||pallavi||)
iṁdām̐kā ninnu dūridi nĕṟam̐gaga ramaṇum̐ḍa
gŏṁdim̐ bāsigūḍina kūḍame kā savulu
(||iṁdām̐||)
virahadābamu mānpa vichchesidi vīḍa viṭṭĕ
vŏraside nā kidĕṁtavubagāramu
sari nīvu navvidenu sallanārĕ nā kobamu
marugam̐ jesina yī mannanĕṁta nāgu
(||iṁdām̐||)
alabĕllām̐ dīra nīseyi aṭṭĕ nābai vesidivi
vŏlisina nā kidĕṁtavubagāramu
paligi momu sūside pallaviṁchĕ nā manasu
kalagālamum̐ jesina karuṇĕṁta nāgu
(||iṁdām̐||)
viḍuvaga yibuḍu śhrī veṁkaḍeśha kūḍidivi
vŏḍaligi nā kidĕṁtavubagāramu
aḍiyāla michchidivi aṁdarilo yĕṁta kīrdi
vuḍivoni valabula kuṁkuvāya nāgu