ఇందాఁకా నేడ నుంటివి యెదురుచూచె నీకు
(॥పల్లవి॥)
ఇందాఁకా నేడ నుంటివి యెదురుచూచె నీకు
చిందీ సెలవి నవ్వు చిమ్మి రేఁగుచు
(॥ఇందా॥)
ముద్దుల పెదవిమీఁద ముక్కర గదలఁగాను
వుద్దండపు మాట లాడె నువిద నిన్ను
కొద్దిమీరి నొసలిపై కుంతలా లల్లాడఁగాను
గుద్దించీ బొమ్మల నీపై కాతరానను
(॥ఇందా॥)
మెఱుఁగుఁ జెక్కులమీఁద మించుఁజెమటలు నిండ
వుఱిముఱిమి చూచీని వొరసి చెలి
జఱసి చన్నులమీఁద జూరుఁబయ్యదతోడ
గుఱిగాఁ జేతులు చాఁచి కొసరీ బీరానను
(॥ఇందా॥)
చక్కనిమేననెల్లా జాజుకొనఁ బులకించి
మిక్కుటమై కూడె నలమేలుమంగ
ఇక్కువ లంటి శ్రీవేంకటేశ నిన్ను మెప్పించి
చొక్కించె రతుల నేఁడు సులభానను
(||pallavi||)
iṁdām̐kā neḍa nuṁṭivi yĕdurusūsĕ nīgu
siṁdī sĕlavi navvu simmi rem̐gusu
(||iṁdā||)
muddula pĕdavimīm̐da mukkara gadalam̐gānu
vuddaṁḍabu māḍa lāḍĕ nuvida ninnu
kŏddimīri nŏsalibai kuṁtalā lallāḍam̐gānu
guddiṁchī bŏmmala nībai kādarānanu
(||iṁdā||)
mĕṟum̐gum̐ jĕkkulamīm̐da miṁchum̐jĕmaḍalu niṁḍa
vuṟimuṟimi sūsīni vŏrasi sĕli
jaṟasi sannulamīm̐da jūrum̐bayyadadoḍa
guṟigām̐ jedulu sām̐si kŏsarī bīrānanu
(||iṁdā||)
sakkanimenanĕllā jājugŏnam̐ bulagiṁchi
mikkuḍamai kūḍĕ nalamelumaṁga
ikkuva laṁṭi śhrīveṁkaḍeśha ninnu mĕppiṁchi
sŏkkiṁchĕ radula nem̐ḍu sulabhānanu