Imdaamkaa naabani yidameemda neebani

ఇందాఁకా నాపని యిటమీఁద నీపని
Language

(॥పల్లవి॥)
ఇందాఁకా నాపని యిటమీఁద నీపని
చెంది నిన్ను నిఁక రట్టుసేయఁ జుమ్మీ యిపుడు

(॥ఇందాఁ॥)
చిత్తము వచ్చినదాఁకాఁ జేసితిని వూడిగము
పొత్తుకు వచ్చినదాఁకాఁ బొదిగితిని
కొత్తరతులను నన్నుఁ గొసరే వప్పటి నీవు
వొత్తి నిన్ను నలయించనోపఁ జుమ్మీ ఇపుడు

(॥ఇందాఁ॥)
మొగము చూచినదాఁకా ముందు ముందే మాటాడి
తగిలినదాఁకా నీతోఁ దమకించితి
బిగువుఁగాఁగిట నాతోఁ బెనఁగే విందుకుఁ బతి
వొగరుగాఁజన్నులను వొత్తుఁ(త్తఁ)జుమ్మీ ఇపుడు

(॥ఇందాఁ॥)
యేకతమఇనదాఁకా యియ్యకొంటిఁ బనులెల్ల
కైకొని కలయుదాఁకాఁ గదిమితిని
మేకుల శ్రీ వేంకటేశ మెచ్చి నన్నుఁ గూడితివి
ఆకడి వెంగేలు నిన్ను ఆడఁ జుమ్మీ ఇపుడు

(||pallavi||)
iṁdām̐kā nābani yiḍamīm̐da nībani
sĕṁdi ninnu nim̐ka raṭṭuseyam̐ jummī yibuḍu

(||iṁdām̐||)
sittamu vachchinadām̐kām̐ jesidini vūḍigamu
pŏttugu vachchinadām̐kām̐ bŏdigidini
kŏttaradulanu nannum̐ gŏsare vappaḍi nīvu
vŏtti ninnu nalayiṁchanobam̐ jummī ibuḍu

(||iṁdām̐||)
mŏgamu sūsinadām̐kā muṁdu muṁde māḍāḍi
tagilinadām̐kā nīdom̐ damagiṁchidi
biguvum̐gām̐giḍa nādom̐ bĕnam̐ge viṁdugum̐ badi
vŏgarugām̐jannulanu vŏttum̐(ttam̐)jummī ibuḍu

(||iṁdām̐||)
yegadama̮inadām̐kā yiyyagŏṁṭim̐ banulĕlla
kaigŏni kalayudām̐kām̐ gadimidini
megula śhrī veṁkaḍeśha mĕchchi nannum̐ gūḍidivi
āgaḍi vĕṁgelu ninnu āḍam̐ jummī ibuḍu