ఇంచుకంతా సిగ్గువడ వెంత ఱట్టడివైతివే
(॥పల్లవి॥)
ఇంచుకంతా సిగ్గువడ వెంత ఱట్టడివైతివే
మించివచ్చే వాయలేవే మేలే నీ పగటు
(॥ఇంచు॥)
కులికి పతిపై నెంత కుమ్మరించేవే వలపు
నలిరేఁగి సెలవుల నవ్వుకొంటాను
చలివాసి యెందాంకా సరసములాడేవే
నిలువుఁగోప్పుతో సారె నిక్కుకొంటాను
(॥ఇంచు॥)
పిక్కటిల్ల నెంత కెంత పెడరేఁచేవే యాసలు
చక్కనిచూపులు వెదచల్లుకొంటాను
తక్కక మోవిచూపి తమి యేల రేఁచేవే
మిక్కుటవుసింగారము మెరసుకొంటాను
(॥ఇంచు॥)
మగిడి శ్రీవేంకటేశు మనసెంత చోక్కించేవే
బిగువుఁజన్నులు దాఁకఁ బెనఁగుకొంటా
తగ నలమేల్ మంగను మగఁడు యీతఁడు నాకు
మొగమేమిచూచేవే మొక్కుకొంటాను
(||pallavi||)
iṁchugaṁtā sigguvaḍa vĕṁta ṟaṭṭaḍivaidive
miṁchivachche vāyaleve mele nī pagaḍu
(||iṁchu||)
kuligi padibai nĕṁta kummariṁcheve valabu
nalirem̐gi sĕlavula navvugŏṁṭānu
salivāsi yĕṁdāṁkā sarasamulāḍeve
niluvum̐goppudo sārĕ nikkugŏṁṭānu
(||iṁchu||)
pikkaḍilla nĕṁta kĕṁta pĕḍarem̐seve yāsalu
sakkanisūbulu vĕdasallugŏṁṭānu
takkaga movisūbi tami yela rem̐seve
mikkuḍavusiṁgāramu mĕrasugŏṁṭānu
(||iṁchu||)
magiḍi śhrīveṁkaḍeśhu manasĕṁta sokkiṁcheve
biguvum̐jannulu dām̐kam̐ bĕnam̐gugŏṁṭā
taga nalamel maṁganu magam̐ḍu yīdam̐ḍu nāgu
mŏgamemisūseve mŏkkugŏṁṭānu