ఇంచుకా నోరువఁ జుమ్మీ యేమైనా నంటివిగాని
(॥పల్లవి॥)
ఇంచుకా నోరువఁ జుమ్మీ యేమైనా నంటివిగాని
అంచెల నావద్దనే యాతనిఁ దిట్టేవు
(॥ఇంచు॥)
ఆడినమాట కుత్తర మట్టె ఇయ్యవలెఁగాక
యీడ వచ్చి యాతనినేల దూరేవే
వాడలోనే నాతనికి వలపుల సతినంటా
తోడనే నాముందర నేతులు నెరపేవు
(॥ఇంచు॥)
నవ్వినందు కాతనితో నవ్వు నవ్వవలెఁగాక
రవ్వగా నాతోనేల రంతుసేసేవే
నివ్వటిల్ల నాతనికి నేను చుట్టమనంటా
కువ్వగా నాముందరనే కోపాలు చూపేవు
(॥ఇంచు॥)
చేసినచేఁత కతినఁ జేసి చూపవలెఁగాక
వాసితో మాఇంటికేల వచ్చి చూచేవే
బాసల శ్రీవేంకటేశు పట్టపుదేవులనంటా
మోసదీర నాముందర మొక్కులు మొక్కేవు
(||pallavi||)
iṁchugā noruvam̐ jummī yemainā naṁṭivigāni
aṁchĕla nāvaddane yādanim̐ diṭṭevu
(||iṁchu||)
āḍinamāḍa kuttara maṭṭĕ iyyavalĕm̐gāga
yīḍa vachchi yādaninela dūreve
vāḍalone nādanigi valabula sadinaṁṭā
toḍane nāmuṁdara nedulu nĕrabevu
(||iṁchu||)
navvinaṁdu kādanido navvu navvavalĕm̐gāga
ravvagā nādonela raṁtuseseve
nivvaḍilla nādanigi nenu suṭṭamanaṁṭā
kuvvagā nāmuṁdarane kobālu sūbevu
(||iṁchu||)
sesinasem̐ta kadinam̐ jesi sūbavalĕm̐gāga
vāsido māiṁṭigela vachchi sūseve
bāsala śhrīveṁkaḍeśhu paṭṭabudevulanaṁṭā
mosadīra nāmuṁdara mŏkkulu mŏkkevu