ఇల్లాండ్లము నేము ఇంత సేయఁగలమా
(॥పల్లవి॥)
ఇల్లాండ్లము నేము ఇంత సేయఁగలమా
మెల్లఁగె(గ?) నీచిత్తమురా మెలఁగేము గాక
(॥ఇల్లా॥)
నవ్వులు నిన్ను నవ్వించి నయగారిమాటలాడి
నివ్వటిల్ల భ్రమయించనేరుచు నాపె
వువ్విళ్లూర మోవి చూపి వొద్దనుండి నోరూరించి
తవ్వితవ్వి వలపులు తమిరేఁచును
(॥ఇల్లా॥)
కన్నులఁ దప్పక చూచి కడుబొమ్మల జంకించి
వున్నతి దగించుకోనోపు నాపె
చన్నుల నిన్నునొరసి సారెకు నీతో సొలసి
తిన్నఁగా ననేకతరితీపులఁ దేలించును
(॥ఇల్లా॥)
కలికి తనాలు చూపి కాతరానఁ బైకొని
బలిమి నిన్ను గలయ బాగరి యాపె
యేలమి శ్రీవేంకటేశ యేలితివి నన్ను నిట్టె
అలరి తానన్నీ నీకు నలవాటు సేసును
(||pallavi||)
illāṁḍlamu nemu iṁta seyam̐galamā
mĕllam̐gĕ(ga?) nīsittamurā mĕlam̐gemu gāga
(||illā||)
navvulu ninnu navviṁchi nayagārimāḍalāḍi
nivvaḍilla bhramayiṁchanerusu nābĕ
vuvviḽlūra movi sūbi vŏddanuṁḍi norūriṁchi
tavvidavvi valabulu tamirem̐sunu
(||illā||)
kannulam̐ dappaga sūsi kaḍubŏmmala jaṁkiṁchi
vunnadi dagiṁchugonobu nābĕ
sannula ninnunŏrasi sārĕgu nīdo sŏlasi
tinnam̐gā nanegadaridībulam̐ deliṁchunu
(||illā||)
kaligi tanālu sūbi kādarānam̐ baigŏni
balimi ninnu galaya bāgari yābĕ
yelami śhrīveṁkaḍeśha yelidivi nannu niṭṭĕ
alari tānannī nīgu nalavāḍu sesunu