Illaaligim dagunade yimta rattadidanamu

ఇల్లాలికిఁ దగునటే యింత రట్టడితనము
Language

(॥పల్లవి॥)
ఇల్లాలికిఁ దగునటే యింత రట్టడితనము
వొల్లనే మితిమేరతో నొనగూడవలదా

(॥ఇల్లా॥)
రవ్వలుగా నవ్వేవు రతికిట్టె లాచేవు
చివ్వన పతిముందర సిగ్గువడవు
వువ్విళ్లూరఁ జన్నులను వూఁదేవాతని వీఁపున
ఇవ్వలఁ గొంచించవు యెంత మందెమేళమే

(॥ఇల్లా॥)
తప్పక మోము చూచేవు తగన మాటాడేవు
కుప్పళించేవు మోహము గుట్టెరఁగవు
ముప్పిరి నేడనైనాను మోవితేనె లడిగేవు
చెప్పరాదే వెరగయ్యా చెల్లఁబో నీ పగటు

(॥ఇల్లా॥)
తోక్కే వాతని పాదము దోమటికిఁ బెనఁగేవు
తక్క వాతని ఘనత దలఁచుకోవు
యిక్కడ శ్రీవేంకటేశుఁ డీతఁడే నన్ను నేలె
చక్కఁ జూడవే నీవు జాణవౌదు విపుడు

(||pallavi||)
illāligim̐ dagunaḍe yiṁta raṭṭaḍidanamu
vŏllane midimerado nŏnagūḍavaladā

(||illā||)
ravvalugā navvevu radigiṭṭĕ lāsevu
sivvana padimuṁdara sigguvaḍavu
vuvviḽlūram̐ jannulanu vūm̐devādani vīm̐puna
ivvalam̐ gŏṁchiṁchavu yĕṁta maṁdĕmeḽame

(||illā||)
tappaga momu sūsevu tagana māḍāḍevu
kuppaḽiṁchevu mohamu guṭṭĕram̐gavu
muppiri neḍanainānu movidenĕ laḍigevu
sĕpparāde vĕragayyā sĕllam̐bo nī pagaḍu

(||illā||)
tokke vādani pādamu domaḍigim̐ bĕnam̐gevu
takka vādani ghanada dalam̐sugovu
yikkaḍa śhrīveṁkaḍeśhum̐ ḍīdam̐ḍe nannu nelĕ
sakkam̐ jūḍave nīvu jāṇavaudu vibuḍu