Illaali semtalaa yivi yellaanu

ఇల్లాలి చేఁతలా యివి యెల్లాను
Language

(॥పల్లవి॥)
ఇల్లాలి చేఁతలా యివి యెల్లాను
కొల్లకత్తెవలెఁ బుచ్చుకొంటివి వుంగరము

(॥ఇల్లా॥)
మందెమేళమున నీమగనితో సారెసారె
పందెము వేయుచు పకపకనవ్వేవు
చెంది నీమీఁది కతనిఁ జేయివట్టి తీసుకొంటా
కందవ లంటేవు యెంతగబ్బివే నీవు

(॥ఇల్లా॥)
కమ్మటి గర్వమున నాగడములాడి యతని
దొమ్మిసేసి పెనఁగుతా తొడ యెక్కేవు
కమ్మఁబూవుబంతిని కళదాఁక వేసుకొంటా
చిమ్మేవు నీకొనగొర నెంత చేఁతలాడివే

(॥ఇల్లా॥)
పిక్కటిల్లు మదమున బిగువుఁజన్నుల నొత్తి
చెక్కునొక్కి బుజముపై జీరదీసేవు
అక్కరతో శ్రీవేంకటాధిపుఁడు నన్నుఁ గూడె
కక్కసించే విపుడెంతకలిగివే నీవు

(||pallavi||)
illāli sem̐talā yivi yĕllānu
kŏllagattĕvalĕm̐ buchchugŏṁṭivi vuṁgaramu

(||illā||)
maṁdĕmeḽamuna nīmaganido sārĕsārĕ
paṁdĕmu veyusu pagabaganavvevu
sĕṁdi nīmīm̐di kadanim̐ jeyivaṭṭi tīsugŏṁṭā
kaṁdava laṁṭevu yĕṁtagabbive nīvu

(||illā||)
kammaḍi garvamuna nāgaḍamulāḍi yadani
dŏmmisesi pĕnam̐gudā tŏḍa yĕkkevu
kammam̐būvubaṁtini kaḽadām̐ka vesugŏṁṭā
simmevu nīgŏnagŏra nĕṁta sem̐talāḍive

(||illā||)
pikkaḍillu madamuna biguvum̐jannula nŏtti
sĕkkunŏkki bujamubai jīradīsevu
akkarado śhrīveṁkaḍādhibum̐ḍu nannum̐ gūḍĕ
kakkasiṁche vibuḍĕṁtagaligive nīvu