పల్లవి:
ఇక్ష్వాకుకుల తిలకా .. ఇకనైన పలుకవే
రామచంద్రా.. నను రక్షింపకున్నను రక్షకులు ఎవరింక రామచంద్రా !
చరణం 1:
చుట్టు ప్రాకారములు సొంపుతో గట్టిస్తి రామచంద్రా !
ఆ ప్రాకారముకు బట్టె పదివేల వరహాలు రామంచంద్రా !
లక్ష్మణుకు చేయిస్తి ముత్యాల పతకము రామచంద్రా !
ఆ పతకానికీ బట్టె పదివేల మొహరీలు రామచంద్రా !
సీతమ్మకూ చేయిస్తినీ చింతాకు పతకమూ రామచంద్రా !
ఆ పతకానికీ బట్టె పదివేల వరహాలు రామచంద్రా !
కలికీతురాయి నీకూ పోలుపుగా జేయిస్తినీ..రామచంద్రా !
నీ తండ్రి దశరథ మహరాజు పంపెనా !
లేక నీ మామ జనక మహరాజు పెట్టెనా !
ఎవడబ్బ సొమ్మనీ కులుకుతూ తిరిగేవు రామచంద్రా!
ఎవడబ్బ సొమ్మనీ కులుకుతూ తిరిగేవు రామచంద్రా!
pallavi:
ikṣhvāgugula tilagā .. iganaina palugave
rāmasaṁdrā.. nanu rakṣhiṁpagunnanu rakṣhagulu ĕvariṁka rāmasaṁdrā !
saraṇaṁ 1:
suṭṭu prāgāramulu sŏṁpudo gaṭṭisti rāmasaṁdrā !
ā prāgāramugu baṭṭĕ padivela varahālu rāmaṁchaṁdrā !
lakṣhmaṇugu seyisti mutyāla padagamu rāmasaṁdrā !
ā padagānigī baṭṭĕ padivela mŏharīlu rāmasaṁdrā !
sīdammagū seyistinī siṁtāgu padagamū rāmasaṁdrā !
ā padagānigī baṭṭĕ padivela varahālu rāmasaṁdrā !
kaligīdurāyi nīgū polubugā jeyistinī..rāmasaṁdrā !
nī taṁḍri daśharatha maharāju paṁpĕnā !
lega nī māma janaga maharāju pĕṭṭĕnā !
ĕvaḍabba sŏmmanī kulugudū tirigevu rāmasaṁdrā!
ĕvaḍabba sŏmmanī kulugudū tirigevu rāmasaṁdrā!