ఇక్కడ నిందరిలోన నేల లోఁగేవు
(॥పల్లవి॥)
ఇక్కడ నిందరిలోన నేల లోఁగేవు
పక్కన సిగ్గువిడిచి పదరాదా లోనికి
(॥ఇక్క॥)
కొప్పు దువ్వేనంటా నాపెఁ గు(గొ?)మ్ముడి వట్టి తీసేవు
కప్పుర మిచ్చేనంటా కాలుదొక్కేవు
ముప్పిరి నీ యిద్దరిలో మూసిమంతనము లేల
యిప్పుడే నోటఁ బిలిచి యేఁగరాదా లోనికి
(॥ఇక్క॥)
కతలు చెప్పేనంటా కనుసన్నలు సేసేవు
పతివెట్టేనంటాఁ జేయిపట్టి తీసేవు
యితవైతే మాముందర నింతేసి వగలేల
రతికేలి కాపె నీవు రారాదా లోనికి
(॥ఇక్క॥)
పందేలు వేసేనంటా బలుములు సేసేవు
కందువలు చూపెనంటా గాఁగిలించేవు
యిందుకుఁగా శ్రీ వేంకటేశ నన్నుఁ గూడితివి
దిందుపడ నాపె నింకాఁ దియ్యరాదా లోనికి
(||pallavi||)
ikkaḍa niṁdarilona nela lom̐gevu
pakkana sigguviḍisi padarādā lonigi
(||ikka||)
kŏppu duvvenaṁṭā nābĕm̐ gu(gŏ?)mmuḍi vaṭṭi tīsevu
kappura michchenaṁṭā kāludŏkkevu
muppiri nī yiddarilo mūsimaṁtanamu lela
yippuḍe noḍam̐ bilisi yem̐garādā lonigi
(||ikka||)
kadalu sĕppenaṁṭā kanusannalu sesevu
padivĕṭṭenaṁṭām̐ jeyibaṭṭi tīsevu
yidavaide māmuṁdara niṁtesi vagalela
radigeli kābĕ nīvu rārādā lonigi
(||ikka||)
paṁdelu vesenaṁṭā balumulu sesevu
kaṁduvalu sūbĕnaṁṭā gām̐giliṁchevu
yiṁdugum̐gā śhrī veṁkaḍeśha nannum̐ gūḍidivi
diṁdubaḍa nābĕ niṁkām̐ diyyarādā lonigi