Iduvamti vojagala dimdarilo nekkudu

ఇటువంటి వోజగల దిందరిలో నెక్కుడు
Language

(॥పల్లవి॥)
ఇటువంటి వోజగల దిందరిలో నెక్కుడు
తటుకన రతులకుఁ దగులైనదానికి

(॥ఇటు॥)
చలము గలుగవలె సరసమాడేయందు
పలుకులు నేరవలె బడినుంటేను
తెలివి చూపఁగవలె తేటగా మొకమునను
చలివాసి పతివద్ద జాణైనదానిక

(॥ఇటు॥)
యిచ్చగించ చూడవలె యేకాంతమైనప్పుడు
విచ్చనవిడి గావలె వేడుకవేళ
కొచ్చి నవ్వవలెఁ దనుఁ గోరి యెదిరించితేను
పచ్చిగా విభునివద్దఁ బ్రౌడైనదానికి

(॥ఇటు॥)
చేరి యలమేలుమంగ సేవచేసేసమయాన
కూరిమి నంటఁగవలె కొంగువట్టితే
యీరీతిఁ గూడె శ్రీవేంకటేశ నిన్ను నలమేల్ మంగ
మేరతో నీవద్ద నిట్టె మేలుగలదానికి

(||pallavi||)
iḍuvaṁṭi vojagala diṁdarilo nĕkkuḍu
taḍugana radulagum̐ dagulainadānigi

(||iḍu||)
salamu galugavalĕ sarasamāḍeyaṁdu
palugulu neravalĕ baḍinuṁṭenu
tĕlivi sūbam̐gavalĕ teḍagā mŏgamunanu
salivāsi padivadda jāṇainadāniga

(||iḍu||)
yichchagiṁcha sūḍavalĕ yegāṁtamainappuḍu
vichchanaviḍi gāvalĕ veḍugaveḽa
kŏchchi navvavalĕm̐ danum̐ gori yĕdiriṁchidenu
pachchigā vibhunivaddam̐ brauḍainadānigi

(||iḍu||)
seri yalamelumaṁga sevasesesamayāna
kūrimi naṁṭam̐gavalĕ kŏṁguvaṭṭide
yīrīdim̐ gūḍĕ śhrīveṁkaḍeśha ninnu nalamel maṁga
merado nīvadda niṭṭĕ melugaladānigi