Iduvamti sadi pomdu lemtani pogadavachchu

ఇటువంటి సతి పొందు లెంతని పొగడవచ్చు
Language

(॥పల్లవి॥)
ఇటువంటి సతి పొందు లెంతని పొగడవచ్చు
తటుకన నీకు నబ్బెఁ దగు మీ యిద్దరికి

(॥ఇటు॥)
చిందేటి పెదవి తేనె చిప్పిలఁగాఁ జెలి నీతో
మందలించి నోరు నిండా మాఁటలాడెను
చందమామవంటి మోము చక్క నెత్తి వేడుకతో
కందువ నీ ముందరను కలకల నవ్వెను

(॥ఇటు॥)
జారిన పయ్యదలోని చనుఁగవ గానరాఁగా
గారవముతోడ నీకుఁ గాను కిచ్చెను
బారెఁడేసి నెరిఁగొప్పుపాదాలపై సోఁకఁగాను
కూరిమితో నీకు నిట్టె గురుతుగా మొక్కెను

(॥ఇటు॥)
బంగారువంటి చేతులఁ బట్టి నీ చెక్కులు నొక్కి
చెంగలించి విడెము నీ చేతి కిచ్చెను
అంగపుఁజెమటతో ని న్నలమి శ్రీవేంకటేశ
వుంగిటిగా రతుల ని న్నోలలాడఁజేసెను

(||pallavi||)
iḍuvaṁṭi sadi pŏṁdu lĕṁtani pŏgaḍavachchu
taḍugana nīgu nabbĕm̐ dagu mī yiddarigi

(||iḍu||)
siṁdeḍi pĕdavi tenĕ sippilam̐gām̐ jĕli nīdo
maṁdaliṁchi noru niṁḍā mām̐ṭalāḍĕnu
saṁdamāmavaṁṭi momu sakka nĕtti veḍugado
kaṁduva nī muṁdaranu kalagala navvĕnu

(||iḍu||)
jārina payyadaloni sanum̐gava gānarām̐gā
gāravamudoḍa nīgum̐ gānu kichchĕnu
bārĕm̐ḍesi nĕrim̐gŏppubādālabai som̐kam̐gānu
kūrimido nīgu niṭṭĕ gurudugā mŏkkĕnu

(||iḍu||)
baṁgāruvaṁṭi sedulam̐ baṭṭi nī sĕkkulu nŏkki
sĕṁgaliṁchi viḍĕmu nī sedi kichchĕnu
aṁgabum̐jĕmaḍado ni nnalami śhrīveṁkaḍeśha
vuṁgiḍigā radula ni nnolalāḍam̐jesĕnu