Iduvamti nee suddulu yeṟaga minnaallunu

ఇటువంటి నీ సుద్దులు యెఱగ మిన్నాళ్ళును
Language

(॥పల్లవి॥)
ఇటువంటి నీ సుద్దులు యెఱగ మిన్నాళ్ళును
తటుకనఁ జెప్పవే వింతలుగా మాకిపుడు

(॥ఇటు॥)
చెక్కులఁ జెమటలారీ చెంపలఁ దురుము జారీ
చిక్కని నవ్వులనే సిగ్గు దేరీని
చక్కని రమణి నీవు సాదువలెనే వుంటివి
యెక్కడ గడించుకొంటివే యావలపు

(॥ఇటు॥)
మోమున గళలు గూడీ మోని గడువసి వాడీ
కామించి నీపోఁకముడి గక్కన వీఁడీ
సామజగమన నీవు సాదువలెనే వుంటివి
యేవిట గడించుకొంటివే యావలపు

(॥ఇటు॥)
తావులు మైఁ జోడుముట్టీ తగు నీట్టూర్పులు దొట్టీ
వూవలై పులకలెల్లా గుంపుగట్టీ
నీ వలమేలుమంగవు నిన్నేలె శ్రీవేంకటేశుఁ -
డేవల గడించుకొంటివే యా వలపు

(||pallavi||)
iḍuvaṁṭi nī suddulu yĕṟaga minnāḽḽunu
taḍuganam̐ jĕppave viṁtalugā māgibuḍu

(||iḍu||)
sĕkkulam̐ jĕmaḍalārī sĕṁpalam̐ durumu jārī
sikkani navvulane siggu derīni
sakkani ramaṇi nīvu sāduvalĕne vuṁṭivi
yĕkkaḍa gaḍiṁchugŏṁṭive yāvalabu

(||iḍu||)
momuna gaḽalu gūḍī moni gaḍuvasi vāḍī
kāmiṁchi nībom̐kamuḍi gakkana vīm̐ḍī
sāmajagamana nīvu sāduvalĕne vuṁṭivi
yeviḍa gaḍiṁchugŏṁṭive yāvalabu

(||iḍu||)
tāvulu maim̐ joḍumuṭṭī tagu nīṭṭūrbulu dŏṭṭī
vūvalai pulagalĕllā guṁpugaṭṭī
nī valamelumaṁgavu ninnelĕ śhrīveṁkaḍeśhum̐ -
ḍevala gaḍiṁchugŏṁṭive yā valabu