ఇటువంటి మనోరథా లింతికి సఫలమాయ
(॥పల్లవి॥)
ఇటువంటి మనోరథా లింతికి సఫలమాయ
తటుకన నీపె నిట్టె దయఁజూడవయ్యా
(॥ఇటు॥)
తలపోసు నీతోడి తనుభోగములు చెలి
మలయుచు నూరకే మాఁటలాడును
చిలుకు కొనగోరను చిమ్ము నిన్ను భావించి
తలిరుఁ జేతుల నీతముల మడుగును
(॥ఇటు॥)
బయలు గాఁగిట నించు పక్కనే ఉన్నాఁడవంట
ప్రియములు చెప్పు నినుఁ బేరఁ బిలుచు
నియతిఁ బరపు చూచి నీవని పాదము చాచు
నయగారి తనాల సన్నలుసేసి కొసరు
(॥ఇటు॥)
సేసవెట్ట నుంకించు సిగ్గువడు నంతలోనే
ఆసతో నవ్వు రతికి నట్టె కొసరు
చేసూటి నంతలో వచ్చి శ్రీవేంకటేశ కూడితి
నీసుద్దు లెల్లాఁ దెలిసి నిక్కముగా మెచ్చును
(||pallavi||)
iḍuvaṁṭi manorathā liṁtigi saphalamāya
taḍugana nībĕ niṭṭĕ dayam̐jūḍavayyā
(||iḍu||)
talabosu nīdoḍi tanubhogamulu sĕli
malayusu nūrage mām̐ṭalāḍunu
silugu kŏnagoranu simmu ninnu bhāviṁchi
talirum̐ jedula nīdamula maḍugunu
(||iḍu||)
bayalu gām̐giḍa niṁchu pakkane unnām̐ḍavaṁṭa
priyamulu sĕppu ninum̐ beram̐ bilusu
niyadim̐ barabu sūsi nīvani pādamu sāsu
nayagāri tanāla sannalusesi kŏsaru
(||iḍu||)
sesavĕṭṭa nuṁkiṁchu sigguvaḍu naṁtalone
āsado navvu radigi naṭṭĕ kŏsaru
sesūḍi naṁtalo vachchi śhrīveṁkaḍeśha kūḍidi
nīsuddu lĕllām̐ dĕlisi nikkamugā mĕchchunu