ఇటువలెనే పో నీయెన్నికలు । నీ
(॥పల్లవి॥)
ఇటువలెనే పో నీయెన్నికలు । నీ-
ఘటన చిన్నియు నీవే కానవుగాక
(॥ఇటు॥)
జడియునీమాఁట నీకుఁ జక్కనేకాదా
కడవారి కియ్యకోలు గావలెఁగాక
విడువక వేముచవి వేమెరుఁగనా యే -
యెడ నెవ్వరైనా నెఱుఁగుటగాక
(॥ఇటు॥)
మిక్కిలినీచేఁత నీకు మెచ్చేకాదా
దిక్కులవారికి నిన్నీఁ దెలుసుఁగాక
చొక్కి దసరూపు దానే చూడవచ్చునా
యెక్కడా నద్దములోనే యేరుపడుఁగాక
(॥ఇటు॥)
నేనును శ్రీవేంకటేశ నీవే కావా
ఐనప్పటి మఱపంతేకాక
తేనెతీపు తేనియకు తెలివియౌనా యిట్టె
పూని చవిగొన్ననన్నుబోఁటి కింతేకాక
(||pallavi||)
iḍuvalĕne po nīyĕnnigalu | nī-
ghaḍana sinniyu nīve kānavugāga
(||iḍu||)
jaḍiyunīmām̐ṭa nīgum̐ jakkanegādā
kaḍavāri kiyyagolu gāvalĕm̐gāga
viḍuvaga vemusavi vemĕrum̐ganā ye -
yĕḍa nĕvvarainā nĕṟum̐guḍagāga
(||iḍu||)
mikkilinīsem̐ta nīgu mĕchchegādā
dikkulavārigi ninnīm̐ dĕlusum̐gāga
sŏkki dasarūbu dāne sūḍavachchunā
yĕkkaḍā naddamulone yerubaḍum̐gāga
(||iḍu||)
nenunu śhrīveṁkaḍeśha nīve kāvā
ainappaḍi maṟabaṁtegāga
tenĕdību teniyagu tĕliviyaunā yiṭṭĕ
pūni savigŏnnanannubom̐ṭi kiṁtegāga