Iduvalem jesumbo yemtavaarini valabu

ఇటువలెఁ జేసుఁబో యెంతవారిని వలపు
Language

(॥పల్లవి॥)
ఇటువలెఁ జేసుఁబో యెంతవారిని వలపు
తటుకన గుట్టుచూపిఁ దప్పులు దేరీని

(॥ఇటు॥)
తలవంచుకొన్న యాపె తమక మాఁపఁగలేక
బలిమి నీ మోము తప్పక చూచీని
తొలుతనే సిగ్గువడి తొయ్యలి ఆసలచేత
పెలుచుమాటల నీకు బ్రియము చెప్పీని

(॥ఇటు॥)
పంతములాడినయాపె పాయమువట్టఁగలేగ
ఇంతలోననే నీకు జేయెత్తి మొక్కీని
వంతువాసు లెంచుకొని వనిత కమ్మటి నేఁడు
ఇంతలోనే పిలువకే ఇంటికి వచ్చీని

(॥ఇటు॥)
యెడమాటాడించేయాపె ఇట్టె ఆస మాన్పలేక
తొడిఁబడ తానే నీపొందులఁ గూడీని
అడరి శ్రీవేంకటేశ అలమేలుమంగ నీకు
వుడివోనిరతి యిచ్చి వురమెక్కీని

(||pallavi||)
iḍuvalĕm̐ jesum̐bo yĕṁtavārini valabu
taḍugana guṭṭusūbim̐ dappulu derīni

(||iḍu||)
talavaṁchugŏnna yābĕ tamaga mām̐pam̐galega
balimi nī momu tappaga sūsīni
tŏludane sigguvaḍi tŏyyali āsalaseda
pĕlusumāḍala nīgu briyamu sĕppīni

(||iḍu||)
paṁtamulāḍinayābĕ pāyamuvaṭṭam̐galega
iṁtalonane nīgu jeyĕtti mŏkkīni
vaṁtuvāsu lĕṁchugŏni vanida kammaḍi nem̐ḍu
iṁtalone piluvage iṁṭigi vachchīni

(||iḍu||)
yĕḍamāḍāḍiṁcheyābĕ iṭṭĕ āsa mānpalega
tŏḍim̐baḍa tāne nībŏṁdulam̐ gūḍīni
aḍari śhrīveṁkaḍeśha alamelumaṁga nīgu
vuḍivoniradi yichchi vuramĕkkīni