Iduvale numdavaddaa yegamaina valabulu

ఇటువలె నుండవద్దా యేకమైన వలపులు
Language

(॥పల్లవి॥)
ఇటువలె నుండవద్దా యేకమైన వలపులు
తటుకనఁ దరితీపు దైలువారీని

(॥ఇటు ॥)
మనసు నమ్మికయైతే మంతనము లింపులౌను
కనుసన్న మెలఁగితే కడువేడుకౌను
తనివి గలిగితేను తాలిములు నిలుచును
యెనసినమీపొందులు యేమని మెచ్చేమే

(॥ఇటు॥)
మాట లొడఁబడికైతే మచ్చికలు సమకూరు
కూటము లొద్దికలైతే గుట్టు చెల్లును
పాటించి మొగమోడితే పనులన్నీఁ జక్కనౌను
యీటులేని మీగుణాలు యెన్నెనీ చెప్పేమే

(॥ఇటు॥)
నగ నేరుచుకొంటే నాఁటుకొనుఁ బ్రియములు
తగులాయమైతేను తమి రేఁగును
అగపడి శ్రీవేంకటాధిపుఁడు నినుఁ గూడె
ఇగురుఁబోడి మీలీల లేమని నుతింతుమే

(||pallavi||)
iḍuvalĕ nuṁḍavaddā yegamaina valabulu
taḍuganam̐ daridību dailuvārīni

(||iḍu ||)
manasu nammigayaide maṁtanamu liṁpulaunu
kanusanna mĕlam̐gide kaḍuveḍugaunu
tanivi galigidenu tālimulu nilusunu
yĕnasinamībŏṁdulu yemani mĕchcheme

(||iḍu||)
māḍa lŏḍam̐baḍigaide machchigalu samagūru
kūḍamu lŏddigalaide guṭṭu sĕllunu
pāḍiṁchi mŏgamoḍide panulannīm̐ jakkanaunu
yīḍuleni mīguṇālu yĕnnĕnī sĕppeme

(||iḍu||)
naga nerusugŏṁṭe nām̐ṭugŏnum̐ briyamulu
tagulāyamaidenu tami rem̐gunu
agabaḍi śhrīveṁkaḍādhibum̐ḍu ninum̐ gūḍĕ
igurum̐boḍi mīlīla lemani nudiṁtume