ఇటువలె నుండవద్దా ఇద్దరి వేడుకలును
(॥పల్లవి॥)
ఇటువలె నుండవద్దా ఇద్దరి వేడుకలును
తటుకనఁ జూచి సంతసమాయ మాకు
(॥ఇటు॥)
వీఁపుఁన జన్నుల మోపి వెలఁది నీకొప్పు దువ్వీ
ఆఁపరానితమి నుస్సురంటాను
మోఁపుచు నాకుమడిచి మోవి నందిచ్చేవాపెకు
చేపట్టి వూడిగా లిట్టే సేయించుకొంటాను
(॥ఇటు॥)
యెదురుగాఁ గూచుండి ఇంతి నీకుఁ బాగ చుట్టీ
వుదుటునఁ దొడాఁదొడా నూఁదుకొంటాను
కదిమి యాపెనోరిలోఁ గప్రపులప్ప వెట్టేవు
అదనఁ బనులుగొనేయట్టినిబ్బరానను
(॥ఇటు॥)
దేవులలమేలుమంగతెచ్చి కఠమాలవెట్టి
శ్రీవేంకటేశ కాఁగిటఁ జిక్కించీ నన్ను
ఆవేళ రెంటేము గప్పే వాకెపయ్యద జారితే
నీవు సింగారింపించుకొనేయాసోదానను
(||pallavi||)
iḍuvalĕ nuṁḍavaddā iddari veḍugalunu
taḍuganam̐ jūsi saṁtasamāya māgu
(||iḍu||)
vīm̐pum̐na jannula mobi vĕlam̐di nīgŏppu duvvī
ām̐parānidami nussuraṁṭānu
mom̐pusu nāgumaḍisi movi naṁdichchevābĕgu
sebaṭṭi vūḍigā liṭṭe seyiṁchugŏṁṭānu
(||iḍu||)
yĕdurugām̐ gūsuṁḍi iṁti nīgum̐ bāga suṭṭī
vuduḍunam̐ dŏḍām̐dŏḍā nūm̐dugŏṁṭānu
kadimi yābĕnorilom̐ gaprabulappa vĕṭṭevu
adanam̐ banulugŏneyaṭṭinibbarānanu
(||iḍu||)
devulalamelumaṁgadĕchchi kaṭhamālavĕṭṭi
śhrīveṁkaḍeśha kām̐giḍam̐ jikkiṁchī nannu
āveḽa rĕṁṭemu gappe vāgĕbayyada jāride
nīvu siṁgāriṁpiṁchugŏneyāsodānanu