Idiye paramayoga middarigi vibhumdaa

ఇదియే పరమయోగ మిద్దరికి విభుఁడా
Language

(॥పల్లవి॥)
ఇదియే పరమయోగ మిద్దరికి విభుఁడా
అదన ననిచిన ద్రిష్టాంతమాయ నిపుడు

(॥ఇది॥)
వెలి మనమిద్దరము వేరై వుందుముగాని
తలఁపులోపలను యిద్దర మొకటే
వొలసి యద్దములోన నొకరూపే రెండై
తెలసినట్లనేపో ద్రిష్టాంతమిపుడు

(॥ఇది॥)
పేరు లిద్దరికి నిట్టె భెదమై తోఁచీఁగాని
తారుకాణగుణము లిద్దరి కొకటే
కోరినమాఁటొకటే కొండశలలో రెండవు
తేరిచూడ విదియేపో ద్రిష్టాంత మిపుడు

(॥ఇది॥)
శ్రీవేంకటేశ నీనాచేఁతలే వేరులుగాని
కేవల మిద్దరికి కాఁగిలి వొకటే
పూవుగుత్తి వొకటే పూఁపలు వేరైనట్లు
దేవ యిన్నిటికి నిదె ద్రిష్టాంత మిపుడు

(||pallavi||)
idiye paramayoga middarigi vibhum̐ḍā
adana nanisina driṣhṭāṁtamāya nibuḍu

(||idi||)
vĕli manamiddaramu verai vuṁdumugāni
talam̐pulobalanu yiddara mŏgaḍe
vŏlasi yaddamulona nŏgarūbe rĕṁḍai
tĕlasinaṭlanebo driṣhṭāṁtamibuḍu

(||idi||)
peru liddarigi niṭṭĕ bhĕdamai tom̐sīm̐gāni
tārugāṇaguṇamu liddari kŏgaḍe
korinamām̐ṭŏgaḍe kŏṁḍaśhalalo rĕṁḍavu
terisūḍa vidiyebo driṣhṭāṁta mibuḍu

(||idi||)
śhrīveṁkaḍeśha nīnāsem̐tale verulugāni
kevala middarigi kām̐gili vŏgaḍe
pūvugutti vŏgaḍe pūm̐palu verainaṭlu
deva yinniḍigi nidĕ driṣhṭāṁta mibuḍu