Idiye naa vinnabamu yimkam dana sittamu

ఇదియే నా విన్నపము యిఁకఁ దన చిత్తము
Language

(॥పల్లవి॥)
ఇదియే నా విన్నపము యిఁకఁ దన చిత్తము
వదలక పైకొంటిఁ బో వసమయ్యీనా

(॥ఇది॥)
మగఁడు దా నియ్యకొంటే మంచిదౌఁగాక వలపు
మగువకుఁ గలిగెఁబో మంతుకెక్కునా
తగులమితో వింటే తగనింపౌఁగాక మాట
జిగిఁ దనతో నాడెఁబో సెలవయ్యీనా

(॥ఇది॥)
చేరి తా నాదరించితే చెల్లుబడౌఁగాక నవ్వు
వూరకే నాకు వచ్చఁబో వొద్దికయ్యీనా
గారవించి కైకొంటే కడునాటుఁగాక చూపు
యీరీతి నేఁ జూచితిఁబో యితవయ్యీనా

(॥ఇది॥)
తమకించి తా వంటితే తగులౌఁగాక కాఁగిలి
చెమరించి పొందితిఁబో సిగ్గుమానీనా
నెమకి నన్నుఁ గూడె తానె శ్రీవేంకటేశుఁడు
అమరెఁబో పనులెల్లా నంటువాసీనా

(||pallavi||)
idiye nā vinnabamu yim̐kam̐ dana sittamu
vadalaga paigŏṁṭim̐ bo vasamayyīnā

(||idi||)
magam̐ḍu dā niyyagŏṁṭe maṁchidaum̐gāga valabu
maguvagum̐ galigĕm̐bo maṁtugĕkkunā
tagulamido viṁṭe taganiṁpaum̐gāga māḍa
jigim̐ danado nāḍĕm̐bo sĕlavayyīnā

(||idi||)
seri tā nādariṁchide sĕllubaḍaum̐gāga navvu
vūrage nāgu vachcham̐bo vŏddigayyīnā
gāraviṁchi kaigŏṁṭe kaḍunāḍum̐gāga sūbu
yīrīdi nem̐ jūsidim̐bo yidavayyīnā

(||idi||)
tamagiṁchi tā vaṁṭide tagulaum̐gāga kām̐gili
sĕmariṁchi pŏṁdidim̐bo siggumānīnā
nĕmagi nannum̐ gūḍĕ tānĕ śhrīveṁkaḍeśhum̐ḍu
amarĕm̐bo panulĕllā naṁṭuvāsīnā