Idiye dishtamu bhoomi nimtulam jesinasemta

ఇదియే దిష్టము భూమి నింతులఁ జేసినచేఁత
Language

(॥పల్లవి॥)
ఇదియే దిష్టము భూమి నింతులఁ జేసినచేఁత
యెదురెదురనే తాఁకు నెఱఁగరే చెలులు

(॥ఇది॥)
పంచబాణములు నేఁడు పడఁతిపై నేసెఁగాన
పంచమహాపాతకుఁడు భావజుఁడే పో
యెంచ విందువఁ కనేపో ఇందరిలో రూపులేక
అంచెల నంతరభూతమై యుండవలనె

(॥ఇది॥)
విరహపుటింతి నింత వెరపించెఁగాన రేఇ
సరిలేనిరాకాసి చందురుఁడే పో
తిరమై నేఁడిందువంక దినములు నొక్కకళ
సురలెల్లఁ దినఁగాను సుక్కువడఁగలిగె

(॥ఇది॥)
కందువ నేటియింతి కాఁగిట గలయఁగాను
యిందు జాణ శ్రీవేంకటేశుఁడే పో
మందలించి ఇందుననే మగువలపాలిటికి
ముందుముందే పురుషోత్తముడు దానై వెలసె

(||pallavi||)
idiye diṣhṭamu bhūmi niṁtulam̐ jesinasem̐ta
yĕdurĕdurane tām̐ku nĕṟam̐gare sĕlulu

(||idi||)
paṁchabāṇamulu nem̐ḍu paḍam̐tibai nesĕm̐gāna
paṁchamahābādagum̐ḍu bhāvajum̐ḍe po
yĕṁcha viṁduvam̐ kanebo iṁdarilo rūbulega
aṁchĕla naṁtarabhūdamai yuṁḍavalanĕ

(||idi||)
virahabuḍiṁti niṁta vĕrabiṁchĕm̐gāna rei
sarilenirāgāsi saṁdurum̐ḍe po
tiramai nem̐ḍiṁduvaṁka dinamulu nŏkkagaḽa
suralĕllam̐ dinam̐gānu sukkuvaḍam̐galigĕ

(||idi||)
kaṁduva neḍiyiṁti kām̐giḍa galayam̐gānu
yiṁdu jāṇa śhrīveṁkaḍeśhum̐ḍe po
maṁdaliṁchi iṁdunane maguvalabāliḍigi
muṁdumuṁde puruṣhottamuḍu dānai vĕlasĕ