ఇదివో సుద్దులు యీరేపల్లెను
(॥పల్లవి॥)
ఇదివో సుద్దులు యీరేపల్లెను
కదిసి యిందరివీఁ గైకొనవయ్యా
(॥ఇది॥)
పలచనిరెప్పలఁ బగటులు నెరపుచు
సొలసి నిన్నొకతె చూచెనటా
తళుకులగోళ్ల దండె మీఁటి యదె
పలికి నిన్నొకతె పాడెనటా
(॥ఇది॥)
చనవులు నెరపుచు సన్న సేయుచును
ననుపున నొక్కతె నవ్వెనటా
చెనకి యొకతె యదె చిగురుగేదఁగుల
వెనకనుండి విను వేసెనటా
(॥ఇది॥)
అదన నీవు నన్నలమిపట్టఁగా
కొదలి యొకతె గని గొణఁగెనటా
యెదురనె శ్రీవేంకటేశ యొకతె నీ -
చెదరినయలకలు చెరిగెనటా
(||pallavi||)
idivo suddulu yīreballĕnu
kadisi yiṁdarivīm̐ gaigŏnavayyā
(||idi||)
palasanirĕppalam̐ bagaḍulu nĕrabusu
sŏlasi ninnŏgadĕ sūsĕnaḍā
taḽugulagoḽla daṁḍĕ mīm̐ṭi yadĕ
paligi ninnŏgadĕ pāḍĕnaḍā
(||idi||)
sanavulu nĕrabusu sanna seyusunu
nanubuna nŏkkadĕ navvĕnaḍā
sĕnagi yŏgadĕ yadĕ sigurugedam̐gula
vĕnaganuṁḍi vinu vesĕnaḍā
(||idi||)
adana nīvu nannalamibaṭṭam̐gā
kŏdali yŏgadĕ gani gŏṇam̐gĕnaḍā
yĕduranĕ śhrīveṁkaḍeśha yŏgadĕ nī -
sĕdarinayalagalu sĕrigĕnaḍā