Idivo seliyabhaava mimka neesitta metto

ఇదివో చెలియభావ మిఁక నీచిత్త మెట్టో
Language

(॥పల్లవి॥)
ఇదివో చెలియభావ మిఁక నీచిత్త మెట్టో
పెదవులు మోఁపిమోఁపి పేరుకొని పాడును

(॥ఇది॥)
నీవు వచ్చేవని చెలి నిలుచుండినిలుచుండి
తోవకెదురుగ వచ్చి తొంగిచూచును
భావములో నీరూపు భావించి భావించి
నీవి జారఁ గరఁగుచు నివ్వెరగు నొందును

(॥ఇది॥)
యెవ్వరు మాఁటాడినా నీయెలుఁగని సారె సారె
అవ్వలనివ్వలఁ జూచి యాలకించును
జవ్వని గాలివెట్టినచప్పు డట్టె వినినిని
మవ్వపుఁగళవళాన మాటలాడును

(॥ఇది॥)
యింతలో శ్రీవేంకటాద్రి యెక్కి ప్రహ్లాదవరద
కాంత నిన్నుఁ గూడి కవకవ నవ్వెను
చింతదీర నీవు మేనఁ జేసినరేకలు చూచి
వంతుల నీమేనఁ జేయవలెనని యెంచును

(||pallavi||)
idivo sĕliyabhāva mim̐ka nīsitta mĕṭṭo
pĕdavulu mom̐pimom̐pi perugŏni pāḍunu

(||idi||)
nīvu vachchevani sĕli nilusuṁḍinilusuṁḍi
tovagĕduruga vachchi tŏṁgisūsunu
bhāvamulo nīrūbu bhāviṁchi bhāviṁchi
nīvi jāram̐ garam̐gusu nivvĕragu nŏṁdunu

(||idi||)
yĕvvaru mām̐ṭāḍinā nīyĕlum̐gani sārĕ sārĕ
avvalanivvalam̐ jūsi yālagiṁchunu
javvani gālivĕṭṭinasappu ḍaṭṭĕ vininini
mavvabum̐gaḽavaḽāna māḍalāḍunu

(||idi||)
yiṁtalo śhrīveṁkaḍādri yĕkki prahlādavarada
kāṁta ninnum̐ gūḍi kavagava navvĕnu
siṁtadīra nīvu menam̐ jesinaregalu sūsi
vaṁtula nīmenam̐ jeyavalĕnani yĕṁchunu