ఇదివో నీ సరసము యీఁతలు మోఁతలునాయ
(॥పల్లవి॥)
ఇదివో నీ సరసము యీఁతలు మోఁతలునాయ
నదులాయఁ గరఁగులు నవ్వు లేఁటికయ్యా
(॥ఇది॥)
వొడివట్టి పెనఁగితే వువిదకుచ్చల వీడె
తొడిఁబడఁ బట్టఁబోరే తురుము జారె
నిడుపులై ముంచుకొంటే నెరులే ముసుఁగాయ
నడుమఁ జిక్కు సిగ్గులు నవ్వు లేఁటికవయ్యా
(॥ఇది॥)
మునుపఁ జెనకబోతే ముగింకెక్కెఁ జన్నులు
పొనిఁగితే మీఁదఁ గప్పె పువ్వుదండలు
మనసున నెంచ నవే మఱఁగుల తెర ఆయ
ననుపు కిందుమీఁదాయ మఱఁగుల తెర ఆయ
(॥ఇది॥)
మలసి కాఁగిలించితే మనసు లేకములాయ
తెలిసి పొందితే మోవిఁ దేనె గారెను
కలసితి రిద్దరును గక్కన శ్రీవేంకటేశ
నలినలి ఆయ రతి నవ్వు లేఁటికయ్యా
(||pallavi||)
idivo nī sarasamu yīm̐talu mom̐talunāya
nadulāyam̐ garam̐gulu navvu lem̐ṭigayyā
(||idi||)
vŏḍivaṭṭi pĕnam̐gide vuvidaguchchala vīḍĕ
tŏḍim̐baḍam̐ baṭṭam̐bore turumu jārĕ
niḍubulai muṁchugŏṁṭe nĕrule musum̐gāya
naḍumam̐ jikku siggulu navvu lem̐ṭigavayyā
(||idi||)
munubam̐ jĕnagabode mugiṁkĕkkĕm̐ jannulu
pŏnim̐gide mīm̐dam̐ gappĕ puvvudaṁḍalu
manasuna nĕṁcha nave maṟam̐gula tĕra āya
nanubu kiṁdumīm̐dāya maṟam̐gula tĕra āya
(||idi||)
malasi kām̐giliṁchide manasu legamulāya
tĕlisi pŏṁdide movim̐ denĕ gārĕnu
kalasidi riddarunu gakkana śhrīveṁkaḍeśha
nalinali āya radi navvu lem̐ṭigayyā