ఇదివో నీ మహిమలు యేమని పొగడేమయ్యా
(॥పల్లవి॥)
ఇదివో నీ మహిమలు యేమని పొగడేమయ్యా
కదిసితేనే యినుము కనకమై మించెను
(॥॥)
సెలవి నీవు నవ్వితే చిత్తము చీఁకటివాసె
వెలసెను నాలోనివేడుకలెల్లా
చెలిమిసేసి నాపైఁ జేయి నీవు వేసితేను
బలిమితో వలపులపంటలెల్లాఁ బండెను
(॥॥)
తప్పక నీవు చూచితే తనువుపై కాఁక మాని
వుప్పతిల్లె జవ్వనము వుదుటునను
కొప్పుదువ్వి నీవు నన్నుఁ గొనగోరు సోఁకించితే
కుప్పళించి తమకపుకొటారులు నిండెను
(॥॥)
చేరి నీవు వలికితే సిగ్గులు మూల కొదిగి
కారుకమ్మె నెమ్మోమునఁ గళలన్నియు
యీరీతి శ్రీవేంకటేశ ఇన్నిటా నన్నేలితివి
సారె నాకిట్టె మదనసామ్రాజ్యము హెచ్చెను
(||pallavi||)
idivo nī mahimalu yemani pŏgaḍemayyā
kadisidene yinumu kanagamai miṁchĕnu
(||||)
sĕlavi nīvu navvide sittamu sīm̐kaḍivāsĕ
vĕlasĕnu nāloniveḍugalĕllā
sĕlimisesi nābaim̐ jeyi nīvu vesidenu
balimido valabulabaṁṭalĕllām̐ baṁḍĕnu
(||||)
tappaga nīvu sūside tanuvubai kām̐ka māni
vuppadillĕ javvanamu vuduḍunanu
kŏppuduvvi nīvu nannum̐ gŏnagoru som̐kiṁchide
kuppaḽiṁchi tamagabugŏḍārulu niṁḍĕnu
(||||)
seri nīvu valigide siggulu mūla kŏdigi
kārugammĕ nĕmmomunam̐ gaḽalanniyu
yīrīdi śhrīveṁkaḍeśha inniḍā nannelidivi
sārĕ nāgiṭṭĕ madanasāmrājyamu hĕchchĕnu