Idivo nee bhaagyamu linnidaa merasenamma

ఇదివో నీ భాగ్యము లిన్నిటా మెరసెనమ్మ
Language

(॥పల్లవి॥)
ఇదివో నీ భాగ్యము లిన్నిటా మెరసెనమ్మ
సదరాన నిటువంటి జన్మము గావలదా

(॥ఇది॥)
చెంతనుండి యాతఁడు నీ చెప్పినట్టు సేయఁగాను
పంతాలాడుకొననేలే పడఁతి
యింతటి సవతు లింద కియ్యకొని వుండఁగాను
సంతతము నీకుఁగల చలము లీడేరెనే

(॥ఇది॥)
సారెకు నాతఁడు నీ చనవు చెల్లించఁగాను
యీరీతి నెమ్మెలు చూప నింకా నేలే
నేరుపున సరివారు నీకింద నడవఁగాను
కూరిమితో నీవుగోరే కోరికె పలించెనే

(॥ఇది॥)
కుచ్చి శ్రీవేంకటేశుఁ డక్కున నిన్నుంచకుండఁగా
ఇచ్చకొలఁది నవ్వేవు యింతేసి యేలే
వొచ్చము లే కింతులెల్లా వూడిగాలు సేయఁగాను
తచ్చి నీవు పట్టిన వ్రతములు చేకూరెనే

(||pallavi||)
idivo nī bhāgyamu linniḍā mĕrasĕnamma
sadarāna niḍuvaṁṭi janmamu gāvaladā

(||idi||)
sĕṁtanuṁḍi yādam̐ḍu nī sĕppinaṭṭu seyam̐gānu
paṁtālāḍugŏnanele paḍam̐ti
yiṁtaḍi savadu liṁda kiyyagŏni vuṁḍam̐gānu
saṁtadamu nīgum̐gala salamu līḍerĕne

(||idi||)
sārĕgu nādam̐ḍu nī sanavu sĕlliṁcham̐gānu
yīrīdi nĕmmĕlu sūba niṁkā nele
nerubuna sarivāru nīgiṁda naḍavam̐gānu
kūrimido nīvugore korigĕ paliṁchĕne

(||idi||)
kuchchi śhrīveṁkaḍeśhum̐ ḍakkuna ninnuṁchaguṁḍam̐gā
ichchagŏlam̐di navvevu yiṁtesi yele
vŏchchamu le kiṁtulĕllā vūḍigālu seyam̐gānu
tachchi nīvu paṭṭina vradamulu segūrĕne