ఇదివో నాభాగ్య మేమిచెప్పేది
(॥పల్లవి॥)
ఇదివో నాభాగ్య మేమిచెప్పేది
మదనగురుఁడు నన్ను మన్నించెను
(॥ఇది॥)
జాణతనాలాడఁగాను సరసుఁ డందుకుమెచ్చి
ఆణిముత్యముల కంఠహార మిచ్చెను
వీణె నేను వాయించఁగ వేడుకతోడ నట్టె
రాణించిన సతులలో(తో?) రతికిఁ జెప్పించెను
(॥ఇది॥)
ఇచ్చకములు సేయఁగా యీతఁడే అందు మెచ్చి
పచ్చలకడియము లప్పటి నిచ్చెను
పచ్చితోడ తనమీఁది పాటలెల్లాఁ బాడఁగాను
పచ్చడముకొంగు నాపైఁగప్పెను
(॥ఇది॥)
చేరి కాఁగిటఁగూడి శ్రీవేంకటేశుఁడు మెచ్చి
పేరుకల నీలాల పెండె మిచ్చెను
నేరి చలమలేల్మంగను నేఁ దన్నుఁ బొగడితేను
సారెసారె నన్ను నేలి చనవిచ్చెను
(||pallavi||)
idivo nābhāgya memisĕppedi
madanagurum̐ḍu nannu manniṁchĕnu
(||idi||)
jāṇadanālāḍam̐gānu sarasum̐ ḍaṁdugumĕchchi
āṇimutyamula kaṁṭhahāra michchĕnu
vīṇĕ nenu vāyiṁcham̐ga veḍugadoḍa naṭṭĕ
rāṇiṁchina sadulalo(to?) radigim̐ jĕppiṁchĕnu
(||idi||)
ichchagamulu seyam̐gā yīdam̐ḍe aṁdu mĕchchi
pachchalagaḍiyamu lappaḍi nichchĕnu
pachchidoḍa tanamīm̐di pāḍalĕllām̐ bāḍam̐gānu
pachchaḍamugŏṁgu nābaim̐gappĕnu
(||idi||)
seri kām̐giḍam̐gūḍi śhrīveṁkaḍeśhum̐ḍu mĕchchi
perugala nīlāla pĕṁḍĕ michchĕnu
neri salamalelmaṁganu nem̐ dannum̐ bŏgaḍidenu
sārĕsārĕ nannu neli sanavichchĕnu