Idivo naa talabomta yemi sedunu

ఇదివో నా తలపోఁత యేమి సేతును
Language

(॥పల్లవి॥)
ఇదివో నా తలపోఁత యేమి సేతును
కదిసి గాలి ముడియ గట్టరాదు గాని

(॥ఇది॥)
వేగినంతా మాటలాడి వేసారదు నామనసు
జాగుకు నీ వోపవంటా జడిసేఁగాని
ఆగడీఁడవు తొలుతే అది సాదించినాఁడవే
ఆగతి నిన్నింత నేను అనరాదు గాని

(॥ఇది॥)
నీమోవి తేనియలాని నిండదు నాలో నాసలు
కోమల మోరువదంటా కొంకేఁ గాని
కామించి తొల్లే అదియు కాయలుగాచి వున్నది
చేముట్టి యిప్పుడు రట్టు సేయరాదుగాని

(॥ఇది॥)
బిగువుఁ జన్నుల నొత్తి పిరితియ్యదు పంతము
మొగి నీ వల సేవంటా మెరఁగేఁగాని
తగు శ్రీ వేంకటేశుఁడ దక్కి నన్నుఁ గూడితివి
నగితి విందుకు నే సన్నలు సేసేఁగాని

(||pallavi||)
idivo nā talabom̐ta yemi sedunu
kadisi gāli muḍiya gaṭṭarādu gāni

(||idi||)
veginaṁtā māḍalāḍi vesāradu nāmanasu
jāgugu nī vobavaṁṭā jaḍisem̐gāni
āgaḍīm̐ḍavu tŏlude adi sādiṁchinām̐ḍave
āgadi ninniṁta nenu anarādu gāni

(||idi||)
nīmovi teniyalāni niṁḍadu nālo nāsalu
komala moruvadaṁṭā kŏṁkem̐ gāni
kāmiṁchi tŏlle adiyu kāyalugāsi vunnadi
semuṭṭi yippuḍu raṭṭu seyarādugāni

(||idi||)
biguvum̐ jannula nŏtti piridiyyadu paṁtamu
mŏgi nī vala sevaṁṭā mĕram̐gem̐gāni
tagu śhrī veṁkaḍeśhum̐ḍa dakki nannum̐ gūḍidivi
nagidi viṁdugu ne sannalu sesem̐gāni