ఇదివో నా నోముఫల మేమిచెప్పేది
(॥పల్లవి॥)
ఇదివో నా నోముఫల మేమిచెప్పేది
కదిసి వో రమణుఁడ కలవుగా నాకు
(॥॥)
సొరిది నామీఁదను నీచూపులు నిండెఁ గనక
విరహవేదనచేత వేఁగనైతి
అరుదై యప్పటి మాటలాడితివిగనక
మరుబాణముల యలమటఁ బొందనైతి
(॥॥)
నగవువెన్నెల నీది నాపై వారెఁ గనక
తగిలి చీఁకటిచింతఁ దలఁకనైతి
నిగిడి నీమనసుకు నేనే గురైతిఁ గనక
జిగిఁ గన్నీటివానలఁ జిక్కువడనైతి
(॥॥)
నెలవై శ్రీ వేంకటేశ నీకౌఁగి లబ్బెఁ గనక
పలుమారు నలపుల బడలనైతి
చలువ నీమోవితేనెచవి దొరకెఁ గనక
పెలుచుఁ దమకముల బిరితియ్యనైతి
(||pallavi||)
idivo nā nomuphala memisĕppedi
kadisi vo ramaṇum̐ḍa kalavugā nāgu
(||||)
sŏridi nāmīm̐danu nīsūbulu niṁḍĕm̐ ganaga
virahavedanaseda vem̐ganaidi
arudai yappaḍi māḍalāḍidiviganaga
marubāṇamula yalamaḍam̐ bŏṁdanaidi
(||||)
nagavuvĕnnĕla nīdi nābai vārĕm̐ ganaga
tagili sīm̐kaḍisiṁtam̐ dalam̐kanaidi
nigiḍi nīmanasugu nene guraidim̐ ganaga
jigim̐ gannīḍivānalam̐ jikkuvaḍanaidi
(||||)
nĕlavai śhrī veṁkaḍeśha nīgaum̐gi labbĕm̐ ganaga
palumāru nalabula baḍalanaidi
saluva nīmovidenĕsavi dŏragĕm̐ ganaga
pĕlusum̐ damagamula biridiyyanaidi