Idi melu nee laaba mimdarilona

ఇది మేలు నీ లాబ మిందరిలోన
Language

(॥పల్లవి॥)
ఇది మేలు నీ లాబ మిందరిలోన
అదనెరిఁగి బేహారా లాడనేర్తువే

(॥ఇది॥)
కన్నులఁ గెంపులుదేరెఁ గాఁకల ముత్యాలు రాలె
వున్నతి మరునిపెద్దవోడ దిగెను
మున్ను మోవిఁ బగడాల మునిఁగేవు నిలాల
కన్నెరో నీవేడనైనా గని గంటివో

(॥ఇది॥)
చెక్కులఁ గస్తూరి నిండెఁ జెమటఁ గుంకుమ గూడె
మొక్కలాన నీకుచాలు మూల గలదో
చిక్కనిమేన జాజులు సెలవిఁ గప్రము చిందె
పక్కన నిదేమి నీకుఁ బంట వండెనో

(॥ఇది॥)
కోరి మేనఁ బైఁ డి రాలీ కొనగోర వెండి రాలీ
నేరుపుల నీవు పెన్నిధి గంటివో
సారెకు శ్రీవేంకటేశ్వరుఁడును నీవు నిట్టె
చేరి మారుబేరాలాడి చెలఁగే రిదెట్టిదో

(||pallavi||)
idi melu nī lāba miṁdarilona
adanĕrim̐gi behārā lāḍanerduve

(||idi||)
kannulam̐ gĕṁpuluderĕm̐ gām̐kala mutyālu rālĕ
vunnadi marunibĕddavoḍa digĕnu
munnu movim̐ bagaḍāla munim̐gevu nilāla
kannĕro nīveḍanainā gani gaṁṭivo

(||idi||)
sĕkkulam̐ gastūri niṁḍĕm̐ jĕmaḍam̐ guṁkuma gūḍĕ
mŏkkalāna nīgusālu mūla galado
sikkanimena jājulu sĕlavim̐ gapramu siṁdĕ
pakkana nidemi nīgum̐ baṁṭa vaṁḍĕno

(||idi||)
kori menam̐ baim̐ ḍi rālī kŏnagora vĕṁḍi rālī
nerubula nīvu pĕnnidhi gaṁṭivo
sārĕgu śhrīveṁkaḍeśhvarum̐ḍunu nīvu niṭṭĕ
seri māruberālāḍi sĕlam̐ge ridĕṭṭido