Idi ennadu veedani kaugili

ఇది ఎన్నడు వీడని కౌగిలి
Year
Language

పల్లవి:

ఇది ఎన్నడు వీడని కౌగిలి
మన ఎదలను కలిపిన రాతిరి
విరబూసెను నేడే అనురాగం
కరుణించెను తానే ఆ దైవం

ఇది ఎన్నడు వీడని కౌగిలి....ఈ..ఈ..ఈ

చరణం 1:

కలువల మించిన నీ కనులు... చిలికెను నాలో వెన్నెలలు
చిగురుల మించిన నీ తనువు... చిందెను నాలో నవమధువు

అందాలన్నీ నీవేలే...అందాలన్నీ నీవేలే
అనుభవమంతా నాదేలేదే

చరణం 2:

కోవెల గంటల నాదంలో.. జీవన గానం విందాము
ఆ..ఆ..ఆ..ఆ..ఆ...ఆ..ఆ..
తీరని వలపుల ఊయలలో ...తీయని కలలే కందాము

ఒకరికి ఒకరు నీడగా...ఒకరికి ఒకరు నీడగా
ఉందాము దైవం తోడుగా

pallavi:

idi ĕnnaḍu vīḍani kaugili
mana ĕdalanu kalibina rādiri
virabūsĕnu neḍe anurāgaṁ
karuṇiṁchĕnu tāne ā daivaṁ

idi ĕnnaḍu vīḍani kaugili....ī..ī..ī

saraṇaṁ 1:

kaluvala miṁchina nī kanulu... siligĕnu nālo vĕnnĕlalu
sigurula miṁchina nī tanuvu... siṁdĕnu nālo navamadhuvu

aṁdālannī nīvele...aṁdālannī nīvele
anubhavamaṁtā nādelede

saraṇaṁ 2:

kovĕla gaṁṭala nādaṁlo.. jīvana gānaṁ viṁdāmu
ā..ā..ā..ā..ā...ā..ā..
tīrani valabula ūyalalo ...tīyani kalale kaṁdāmu

ŏgarigi ŏgaru nīḍagā...ŏgarigi ŏgaru nīḍagā
uṁdāmu daivaṁ toḍugā