Ide yade yavi bomke demdaamkaane

ఇదె యదె యవి బొంకే దెందాఁకానే
Language

(॥పల్లవి॥)
ఇదె యదె యవి బొంకే దెందాఁకానే
కదిసే నన్నిపనులుఁ గానీ కానీ తాను

(॥ఇదె॥)
యెరవై తాఁదిరిగాడే లెందకాఁనే నేఁటి
వరుస కీడకు రావలెఁగా తాను
యెరపరికపుపొందు లెందాఁకనె ఇట్టె
గరిమ నామోము చూడవలెఁగా తాను

(॥ఇదె॥)
యేడో పరాకు చేసే దెందాఁకనే నన్ను
వాడిక విడె మడుగవలెఁగా తాను
యీడ నిట్టె యెడమాఁట లెందాఁకానే! నాతో
యీడుకు బొత్తుకు వచ్చే దిప్పుడేకా తాను

(॥ఇదె॥)
యెనలేనిసిగ్గు దన కెందాఁకనే! తన
వనిత నయితిఁ గైకొనవలెఁగా తాను
యెనసెఁ శ్రీవేంకటేశుఁ డెందాఁకానే! నాకుఁ
జనవిచ్చి నయాలే జరపెఁగా తాను

(||pallavi||)
idĕ yadĕ yavi bŏṁke dĕṁdām̐kāne
kadise nannibanulum̐ gānī kānī tānu

(||idĕ||)
yĕravai tām̐dirigāḍe lĕṁdagām̐ne nem̐ṭi
varusa kīḍagu rāvalĕm̐gā tānu
yĕrabarigabubŏṁdu lĕṁdām̐kanĕ iṭṭĕ
garima nāmomu sūḍavalĕm̐gā tānu

(||idĕ||)
yeḍo parāgu sese dĕṁdām̐kane nannu
vāḍiga viḍĕ maḍugavalĕm̐gā tānu
yīḍa niṭṭĕ yĕḍamām̐ṭa lĕṁdām̐kāne! nādo
yīḍugu bŏttugu vachche dippuḍegā tānu

(||idĕ||)
yĕnalenisiggu dana kĕṁdām̐kane! tana
vanida nayidim̐ gaigŏnavalĕm̐gā tānu
yĕnasĕm̐ śhrīveṁkaḍeśhum̐ ḍĕṁdām̐kāne! nāgum̐
janavichchi nayāle jarabĕm̐gā tānu