Ide tana korige leedere

ఇదె తన కోరికె లీడేరె
Language

(॥పల్లవి॥)
ఇదె తన కోరికె లీడేరె
పదివేలకుఁ దన భాగ్యంబాయ

(॥ఇదె॥)
కలికి జవ్వనము కారుకొనీ నిదె
వలపులపరువము వచ్చె నిదె
మొలకల చన్నులు మోసులెత్తెనవె
పిలిచి తేఁగదరే ప్రియుని నిచటికి

(॥ఇదె॥)
వువిదమోము కళ లుప్పతిలీ నివె
పవడవాతెరయుఁ బండె యిదె
నవకపు సిగ్గులు ననలొత్తీ నవె
వివరించిపతిని వెసెఁదోడితేరె

(॥ఇదె॥)
యింతిచూపు తను నెదురుకొనీ నిదె
వింత చెలువములు వెలసీ నివె
యింతలో శ్రీవేంకటేశుఁడు దానె
కొంతఁ గూడె నెప్పుడు రమ్మనరే

(||pallavi||)
idĕ tana korigĕ līḍerĕ
padivelagum̐ dana bhāgyaṁbāya

(||idĕ||)
kaligi javvanamu kārugŏnī nidĕ
valabulabaruvamu vachchĕ nidĕ
mŏlagala sannulu mosulĕttĕnavĕ
pilisi tem̐gadare priyuni nisaḍigi

(||idĕ||)
vuvidamomu kaḽa luppadilī nivĕ
pavaḍavādĕrayum̐ baṁḍĕ yidĕ
navagabu siggulu nanalŏttī navĕ
vivariṁchibadini vĕsĕm̐doḍiderĕ

(||idĕ||)
yiṁtisūbu tanu nĕdurugŏnī nidĕ
viṁta sĕluvamulu vĕlasī nivĕ
yiṁtalo śhrīveṁkaḍeśhum̐ḍu dānĕ
kŏṁtam̐ gūḍĕ nĕppuḍu rammanare