ఇదే పాట... ప్రతీచోటా..
పల్లవి:
ఇదే పాటా ప్రతీ చోటా ఇలాగే పాడుకుంటాను
పలుకలేని వలపులన్నీ పాటలో దాచుకుంటాను ||2||
చరణం 1:
నా పాట విని మురిశావు ఆ పైన నను వలచావు !!2!!
కలలాగ నను కలిశావు లతలాగ నను పెనవేశావు
ఒక గానమై ఒకప్రాణమై జతగూడి మనమున్నాము
ఉన్నాము ఉన్నాము
చరణం 2:
నాడేమి ఉందని భ్రమశేవు నేడేమి లేదని విడిచేవు !!2!!
ఆ మూడుముళ్లని మరిచేవు నా పాల మనసుని విరిచేవు
ఈనాడు నను విడనాడినా ఏనాటికైనా కలిసేవు నువు
కలిసేవు నను కలిసేవూ
pallavi:
ide pāḍā pradī soḍā ilāge pāḍuguṁṭānu
palugaleni valabulannī pāḍalo dāsuguṁṭānu ||2||
saraṇaṁ 1:
nā pāḍa vini muriśhāvu ā paina nanu valasāvu !!2!!
kalalāga nanu kaliśhāvu ladalāga nanu pĕnaveśhāvu
ŏga gānamai ŏgaprāṇamai jadagūḍi manamunnāmu
unnāmu unnāmu
saraṇaṁ 2:
nāḍemi uṁdani bhramaśhevu neḍemi ledani viḍisevu !!2!!
ā mūḍumuḽlani marisevu nā pāla manasuni virisevu
īnāḍu nanu viḍanāḍinā enāḍigainā kalisevu nuvu
kalisevu nanu kalisevū