Iddarunum goodidiri yiga nennamdu

ఇద్దరునుఁ గూడితిరి యిక నెన్నఁడు
Language

(॥పల్లవి॥)
ఇద్దరునుఁ గూడితిరి యిక నెన్నఁడు
సుద్దుల మా మొగమేమి చూచేరయ్యా

(॥ఇద్ద॥)
సతి చెమటకాఁగిలే చక్కనికేళాకూళి
యితవైనవలపులే యీఁతా మోఁతా
మతకరిసిగ్గులే మంచినీటిచల్లులాట
తతిగొని మీరు వంసతములాడరయ్యా

(॥ఇద్ద॥)
చెలిగోరిచెనుకులే చిమ్మనఁగోవిచిమ్ములు
కులుకునవ్వులే తలకొన్న తెప్పలు
పిలుపులమాఁటలే పెట్టినట్టివొలలు
కిలకిల నవ్వి జలకేలి సేయరయ్యా

(॥ఇద్ద॥)
ముగుడచన్నులు తమ్మి మొగ్గలవేట్లు నీకు
తగినకూటములే పంతపుముంపులు
అగడై శ్రీవేంకటేశ ఆయాలంటి కూడితిరి
నిగిడిన పెండ్లితోడ నీళ్లాడరయ్యా

(||pallavi||)
iddarunum̐ gūḍidiri yiga nĕnnam̐ḍu
suddula mā mŏgamemi sūserayyā

(||idda||)
sadi sĕmaḍagām̐gile sakkanigeḽāgūḽi
yidavainavalabule yīm̐tā mom̐tā
madagarisiggule maṁchinīḍisallulāḍa
tadigŏni mīru vaṁsadamulāḍarayyā

(||idda||)
sĕligorisĕnugule simmanam̐govisimmulu
kulugunavvule talagŏnna tĕppalu
pilubulamām̐ṭale pĕṭṭinaṭṭivŏlalu
kilagila navvi jalageli seyarayyā

(||idda||)
muguḍasannulu tammi mŏggalaveṭlu nīgu
taginagūḍamule paṁtabumuṁpulu
agaḍai śhrīveṁkaḍeśha āyālaṁṭi kūḍidiri
nigiḍina pĕṁḍlidoḍa nīḽlāḍarayyā