ఇద్దరును నొకటైతి రిఁకనేఁటికి
(॥పల్లవి॥)
ఇద్దరును నొకటైతి రిఁకనేఁటికి
బుద్దులు బోదించఁబోతే వొసఁగీనా ఇపుడు
(॥ఇద్ద॥)
చేయెత్తి నీకు మొక్కె చెలయి కానుకలిచ్చె
చేయరాని విన్నపాలు సేసె నీతోను
నాయకుఁడ నీవాకెను నమ్మించితి వన్నిటాను
నాయములు చెప్పఁబోతే నవ్వు రాదా ఇఁకు
(॥ఇద్ద॥)
చేరి యాపె కూచుండె చిత్తము రా సేవసేసె
కూరిమి వేఁడుకొంటాఁ జెక్కులు నొక్కెను
నేరిపితి వీకతలు నీసొమ్ము సేసుకొంటివి
కారణా లడుగఁబోతే కడమ యేదిఁకను
(॥ఇద్ద॥)
సేసెవెట్టె నీపై నాకె చెలరేఁగి విడె మిచ్చె
ఆనతో శ్రీవేంకటేశ అక్కునఁ జేర్చె
వాసులెంచి నీవు నన్ను వలెనని కూడితిని
రాసికూటా లెంచఁబోతే రవ్వగాదా ఇఁకను
(||pallavi||)
iddarunu nŏgaḍaidi rim̐kanem̐ṭigi
buddulu bodiṁcham̐bode vŏsam̐gīnā ibuḍu
(||idda||)
seyĕtti nīgu mŏkkĕ sĕlayi kānugalichchĕ
seyarāni vinnabālu sesĕ nīdonu
nāyagum̐ḍa nīvāgĕnu nammiṁchidi vanniḍānu
nāyamulu sĕppam̐bode navvu rādā im̐ku
(||idda||)
seri yābĕ kūsuṁḍĕ sittamu rā sevasesĕ
kūrimi vem̐ḍugŏṁṭām̐ jĕkkulu nŏkkĕnu
neribidi vīgadalu nīsŏmmu sesugŏṁṭivi
kāraṇā laḍugam̐bode kaḍama yedim̐kanu
(||idda||)
sesĕvĕṭṭĕ nībai nāgĕ sĕlarem̐gi viḍĕ michchĕ
ānado śhrīveṁkaḍeśha akkunam̐ jersĕ
vāsulĕṁchi nīvu nannu valĕnani kūḍidini
rāsigūḍā lĕṁcham̐bode ravvagādā im̐kanu