Iddarunu menavaare iyyagole imdarigi

ఇద్దరును మేనవారే ఇయ్యకోలే ఇందరికి
Language

(॥పల్లవి॥)
ఇద్దరును మేనవారే ఇయ్యకోలే ఇందరికి
పొద్దువొద్దుకు నిచ్చల భోగింతురుగారా

(॥॥)
మెలుఁతకు నీవైతే మేలువాఁడవు తొల్లె
నెలకొని యాపెయును నీకు వలచు
యెలమిఁ జెలికత్తె లెడమాట లేమాడేరు
తలఁచుక మీరే రతిఁ దగులుట గాక

(॥॥)
ఆకెమనసుమర్మము లన్నిటా నీవెరుఁగుదు
దాకొని నీమన సాకె తా నెరుఁగును
యీకడాకడిచుట్టాలు యేమిబుద్దులుచెప్పేరు
మేకొని సరసములు మీరే యాడుట గాక

(॥॥)
నీదేవులమంచముపై నీవు పాదాలు చాఁచితే
ఆదటఁ జేయి నీమంచాన నా పో చాఁచెను
యీదెస శ్రీవేంకటేశ యేమని యెచ్చరించేము
పోదితోఁ గూడితి రిట్టె పొఁసగుట గాక

(||pallavi||)
iddarunu menavāre iyyagole iṁdarigi
pŏdduvŏddugu nichchala bhogiṁturugārā

(||||)
mĕlum̐tagu nīvaide meluvām̐ḍavu tŏllĕ
nĕlagŏni yābĕyunu nīgu valasu
yĕlamim̐ jĕligattĕ lĕḍamāḍa lemāḍeru
talam̐suga mīre radim̐ daguluḍa gāga

(||||)
āgĕmanasumarmamu lanniḍā nīvĕrum̐gudu
dāgŏni nīmana sāgĕ tā nĕrum̐gunu
yīgaḍāgaḍisuṭṭālu yemibuddulusĕpperu
megŏni sarasamulu mīre yāḍuḍa gāga

(||||)
nīdevulamaṁchamubai nīvu pādālu sām̐side
ādaḍam̐ jeyi nīmaṁchāna nā po sām̐sĕnu
yīdĕsa śhrīveṁkaḍeśha yemani yĕchchariṁchemu
podidom̐ gūḍidi riṭṭĕ pŏm̐saguḍa gāga