Iddarum gadisinaaru yedurubadi nunnaaru

ఇద్దరుఁ గదిసినారు యెదురుబడి నున్నారు
Language

(॥పల్లవి॥)
ఇద్దరుఁ గదిసినారు యెదురుబడి నున్నారు
పొద్దువొద్దునకు మిమ్ము బోదించవలెసె

(॥ఇద్ద॥)
పిలిచీ నూఁకొనరాదా ప్రియురాలు నిన్నునిట్టె
తలయెత్తి చూడరాదా దండ నున్నది
బలిమి బెనఁగరాదా పంతములే నెరపీని
చెలులముగన నేము చెప్పకుండరాదు

(॥ఇద్ద॥)
నవ్వీ మారు నవ్వరాదా నలినాక్షి నిన్నుఁజూచి
జవ్వన మంటఁగ రాదా సమ్మతించీని
పువ్వుల వేయఁగరాదా పొంచి సరస మాడీని
ఇవ్వల నేమిటు మిమ్ము యెచ్చరించఁదగును

(॥ఇద్ద॥)
కలసీఁ బెండ్లాడరాదా గక్కనఁ బానుపుమీఁద
తలఁపు చేకొనరాదా తమకించీని
యెలమి శ్రీ వేంకటేశ ఇంతి నిట్టె యేలితివి
లలి నొడఁగూర్చి మిమ్ము లాలించే మిఁకను

(||pallavi||)
iddarum̐ gadisināru yĕdurubaḍi nunnāru
pŏdduvŏddunagu mimmu bodiṁchavalĕsĕ

(||idda||)
pilisī nūm̐kŏnarādā priyurālu ninnuniṭṭĕ
talayĕtti sūḍarādā daṁḍa nunnadi
balimi bĕnam̐garādā paṁtamule nĕrabīni
sĕlulamugana nemu sĕppaguṁḍarādu

(||idda||)
navvī māru navvarādā nalinākṣhi ninnum̐jūsi
javvana maṁṭam̐ga rādā sammadiṁchīni
puvvula veyam̐garādā pŏṁchi sarasa māḍīni
ivvala nemiḍu mimmu yĕchchariṁcham̐dagunu

(||idda||)
kalasīm̐ bĕṁḍlāḍarādā gakkanam̐ bānubumīm̐da
talam̐pu segŏnarādā tamagiṁchīni
yĕlami śhrī veṁkaḍeśha iṁti niṭṭĕ yelidivi
lali nŏḍam̐gūrsi mimmu lāliṁche mim̐kanu