ఇద్దరికిఁ జుట్టరిక మీరీతిఁ గలిగె మీకు
(॥పల్లవి॥)
ఇద్దరికిఁ జుట్టరిక మీరీతిఁ గలిగె మీకు
చద్దికి వేఁడికి సరసములాడరె
(॥॥)
కలువ రేకులవంటికన్ను లాతఁడు నీపతి
తొలుతనే నీమోముఁజందురుఁ జూపవే
బెళుకులేనియట్టిబింబాధరుఁ డాతఁడు
చిలుక పలుకుల రంజిలఁజేయవే
(॥॥)
మించుల నీలమేఘము మేనిచాయవాఁడతఁడు
కొంచక నీచూపు మెరుఁగులు చల్లవే
పొంచి తామరపువ్వలఁబోలిన పాదాలాతఁడు
వంచి తుమ్మిదల కొప్పు వడి సోఁక మొక్కవే
(॥॥)
గందపుమాని కొమ్మల చేతులతఁడు
అందుకొని లతాంగివి అలముకోవే
అందపు శ్రీ వేంకటేశుఁ డలమేల్ మంగవు నీవు
చెందితి రిన్నిటా నిఁక సేసచల్లుకొనరే
(||pallavi||)
iddarigim̐ juṭṭariga mīrīdim̐ galigĕ mīgu
saddigi vem̐ḍigi sarasamulāḍarĕ
(||||)
kaluva regulavaṁṭigannu lādam̐ḍu nībadi
tŏludane nīmomum̐jaṁdurum̐ jūbave
bĕḽuguleniyaṭṭibiṁbādharum̐ ḍādam̐ḍu
siluga palugula raṁjilam̐jeyave
(||||)
miṁchula nīlameghamu menisāyavām̐ḍadam̐ḍu
kŏṁchaga nīsūbu mĕrum̐gulu sallave
pŏṁchi tāmarabuvvalam̐bolina pādālādam̐ḍu
vaṁchi tummidala kŏppu vaḍi som̐ka mŏkkave
(||||)
gaṁdabumāni kŏmmala seduladam̐ḍu
aṁdugŏni ladāṁgivi alamugove
aṁdabu śhrī veṁkaḍeśhum̐ ḍalamel maṁgavu nīvu
sĕṁdidi rinniḍā nim̐ka sesasallugŏnare