ఇద్దరికిఁ బోవునా ఇదియుఁ గొంతా
(॥పల్లవి॥)
ఇద్దరికిఁ బోవునా ఇదియుఁ గొంతా
అద్దుకొన్న వలపౌత అది నీవెఱఁగవా
(॥ఇద్ద॥)
పంతము దప్పీనా పక్కన నవ్వితే మాతో
కొంతగొంత నవ్వునవ్వి గుక్కుకొనేవు
మంతనాన నొకవేళ మాటమాట జగడాలు
అంతనంతనే పాసె నది నీ వెఱఁగవా
(॥ఇద్ద॥)
దొరతనము వోయీనా తొంగిచూచితే మమ్ము
ధర పులుకనఁ జూచి తలవంచేవు
విరస మేమిగల్లాను వేళవేళనే పాసె
అరగొరత లిఁకేల అవి నీవెఱఁగవా
(॥ఇద్ద॥)
పాకము దప్పీనా పలికితే మాతోను
మాకువలె రతిఁజొక్కి మఱచేవు
యేకమైతి శ్రీ వేంకటేశ మమ్ము గూడితేను
ఆకతలే చెప్పనేల అది నీ వెఱఁగవా
(||pallavi||)
iddarigim̐ bovunā idiyum̐ gŏṁtā
addugŏnna valabauda adi nīvĕṟam̐gavā
(||idda||)
paṁtamu dappīnā pakkana navvide mādo
kŏṁtagŏṁta navvunavvi gukkugŏnevu
maṁtanāna nŏgaveḽa māḍamāḍa jagaḍālu
aṁtanaṁtane pāsĕ nadi nī vĕṟam̐gavā
(||idda||)
dŏradanamu voyīnā tŏṁgisūside mammu
dhara puluganam̐ jūsi talavaṁchevu
virasa memigallānu veḽaveḽane pāsĕ
aragŏrada lim̐kela avi nīvĕṟam̐gavā
(||idda||)
pāgamu dappīnā paligide mādonu
māguvalĕ radim̐jŏkki maṟasevu
yegamaidi śhrī veṁkaḍeśha mammu gūḍidenu
āgadale sĕppanela adi nī vĕṟam̐gavā